రోడ్ల కింద నదులు పారుతాయ్‌!

లండన్‌ మహా నగరం యునైటెడ్‌ కింగ్‌డమ్‌, ఇంగ్లండ్‌ దేశ రాజధాని. ‘లండినియమ్‌’ అనే రోమన్లు స్థాపించారీ నగరాన్ని. అందుకే ఈ నగరానికీ పేరు. సిటీ ఆఫ్‌ లండన్‌, సిటీ ఆఫ్‌ వెస్ట్‌మినిస్టర్‌ అనే రెండు ప్రాచీన నగరాలు కలిసి ఈ నగరం ఏర్పడింది. ‌లండన్‌ అనే పేరుకు ముందు దీన్ని లండనీయమ్‌, లడెన్‌విస్‌, లడెన్‌బర్గ్‌ అంటూ రకరకాల పేర్లతో పిలిచేవారట...

Published : 02 Jun 2018 01:37 IST

మహా నగరం లండన్‌
రోడ్ల కింద నదులు పారుతాయ్‌!

లండన్‌ మహా నగరం యునైటెడ్‌ కింగ్‌డమ్‌, ఇంగ్లండ్‌ దేశ రాజధాని.
* ‘లండినియమ్‌’ అనే రోమన్లు స్థాపించారీ నగరాన్ని. అందుకే ఈ నగరానికీ పేరు. సిటీ ఆఫ్‌ లండన్‌, సిటీ ఆఫ్‌ వెస్ట్‌మినిస్టర్‌ అనే రెండు ప్రాచీన నగరాలు కలిసి ఈ నగరం ఏర్పడింది.
* లండన్‌ అనే పేరుకు ముందు దీన్ని లండనీయమ్‌, లడెన్‌విస్‌, లడెన్‌బర్గ్‌ అంటూ రకరకాల పేర్లతో పిలిచేవారట.
* పార్లమెంట్‌ హౌస్‌ను అధికారికంగా ‘ది ప్యాలస్‌ ఆఫ్‌ వెస్ట్‌మినిస్టర్‌’ అంటారు. దేశంలోనే అతిపెద్ద భవంతి ఇది.
* ఇక్కడ బ్లాక్‌ క్యాబ్‌ డ్రైవర్‌ అవ్వాలంటే పెద్ద పరీక్షే ఉంటుంది. దాని పేరు ‘ది నాలెడ్జ్‌’. ఈ నగరంలో ప్రతీ వీధి సిగ్నల్‌ కూడా తెలుసుండాలి. అవన్నీ తెలుసుకోవడానికి చాలా సమయమే కేటాయించాల్సి వస్తుంది మరి.
* లండన్‌ వీధుల కింద ఇంచుమించు 20 భూగర్భ నదులు ప్రవహిస్తూ ఉన్నాయి.
* ధనిక నగరాల్లో ఇదీ ఒకటి.

నగరం: లండన్‌
దేశం: ఇంగ్లండ్‌
విస్తీర్ణం: 1,572 చదరపు కిలోమీటర్లు
జనాభా: 87 లక్షల 87 వేలకుపైమాటే
* లండన్‌ నగరం మీదుగా థేమ్స్‌ నది ప్రవహిస్తుంటుంది.

* ఇక్కడి లండన్‌ బ్రిడ్జ్‌ ప్రత్యేక ఆకర్షణ.

* ఈ నగరంలోని మరో ప్రత్యేక ఆకర్షణ ‘లండన్‌ ఐ’. 2006 వరకు ఇదే ప్రపంచంలోని అతి పెద్ద ఫెర్రీస్‌ వీల్‌.

 

* ప్రపంచంలో ఎక్కువగా పర్యాటకుల్ని ఆకట్టుకునే ప్రాంతమిది. 2014 సంవత్సరంలోనే కోటీ 60 లక్షల మంది సందర్శించారీ నగరాన్ని.
* బిగ్‌ బెన్‌... ప్రపంచంలో గంటలు కొట్టే అతి పెద్ద నాలుగు ముఖాల గడియారం.
* లండన్‌ ఎంతో వైవిధ్యం ఉన్న నగరం. వివిధ జాతుల, మతాల, సంస్కృతుల సమ్మేళనం. ఈ నగరంలో మాట్లాడే భాషల సంఖ్య 300. వీటిల్లో బెంగాలీ, గుజరాతీ, పంజాబీ వంటి బోలెడు భాషలున్నాయి.

* గొప్ప చరిత్ర, అద్భుతమైన ఆర్కిటెక్చర్‌ ఈ నగరం సొంతం.
* ప్రపంచంలోని పది ప్రసిద్ధ మ్యూజియాల్లో మూడు ఇక్కడే ఉన్నాయి. 860 ఆర్ట్‌ గ్యాలరీలతో కొలువై ఉంటాయివి.
* మొదటిసారిగా భూగర్భరైల్వే వ్యవస్థ ఏర్పాటైంది ఇక్కడే. 1863లో ఈ రైళ్ల ప్రయాణం ప్రారంభమైంది.
* ఇక్కడ 122 మైళ్ల దూరంతో అతిపెద్ద రింగ్‌ రోడ్‌ ఉంది.
* 1868లో ప్రపంచంలో మొదటి ట్రాఫిక్‌ లైట్‌ని ఈ నగరంలోనే ఏర్పాటు చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు