మహా నగరం 

ప్రఖ్యాత నోబెల్‌ బహుమతిని స్థాపించిన ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ది ఈ నగరమే. ఈ బహుమతుల ప్రదానోత్సవం జరిగేది ఇక్కడే. భౌతిక, రసాయన, వైద్యశాస్త్రాల్లో, సాహిత్య విభాగాల్లో  నోబెల్‌ బహుమతుల్ని ఏటా ఈ నగరంలోనే...

Published : 17 Oct 2018 14:51 IST

స్టాక్‌హోం 
నోబెల్‌ ఇచ్చేది ఇక్కడే ! 

మహా నగరం 

 

నగరం: స్టాక్‌హోం 
దేశం: స్వీడన్‌ 
విస్తీర్ణం: 188 చదరపు కిలోమీటర్లు 
జనాభా: దాదాపు పది లక్షలు

ప్రఖ్యాత నోబెల్‌ బహుమతిని స్థాపించిన ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ది ఈ నగరమే. ఈ బహుమతుల ప్రదానోత్సవం జరిగేది ఇక్కడే. భౌతిక, రసాయన, వైద్యశాస్త్రాల్లో, సాహిత్య విభాగాల్లో  నోబెల్‌ బహుమతుల్ని ఏటా ఈ నగరంలోనే ఇస్తుంటారు. 1901లో  మొదటి నోబెల్‌ బహుమతుల ప్రదానోత్సవం కూడా ఇక్కడే జరిగింది.  

మహా నగరం 

 

* ప్రపంచంలో జాతీయ పట్టణ ఉద్యానవనమున్న ఏకైక రాజధానీ నగరమిది. ఈ పార్కు పేరు రాయల్‌ నేషనల్‌ సిటీ. తొమ్మిదిన్నర కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండే ఈ పార్కులో జింకలు, కుందేళ్లు, నక్కలు, రకరకాల జాతుల సీతాకోక చిలుకలు, పక్షులు కొలువై ఉంటాయి. 
* స్టాక్‌హోం.. స్వీడన్‌ దేశ రాజధాని. దేశంలోనే అతి పెద్ద నగరం. స్వీడన్‌లోని జనాభాలో 22 శాతం ప్రజలు ఇక్కడే నివసిస్తున్నారు. 
* మలారిన్‌ మంచి నీటి సరస్సు బాల్టిక్‌ సముద్రం వైపు పారే చోట 14 దీవుల సముదాయంగా ఉంటుందీ నగరం. ‘బ్యూటీ ఆన్‌ ది వాటర్‌’ అనే ముద్దు పేరూ ఉందీ నగరానికి. 
* మొత్తం నగరం 30 శాతం నీటి దారుల మధ్య ఉంటే 30 శాతం భాగం ఉద్యానవనాలతో పచ్చగా ఉంటుంది. 
* 1252 నుంచే ఇది ఒక పట్టణం. స్వీడిష్‌ పాలకుడు బిర్జర్‌ జార్ల్‌ నిర్మించారట. అప్పటి నుంచే దీనిని స్టాక్‌హోం అనే పేరుతో పిలుస్తున్నారు. 
* స్వీడన్‌ దేశంలో అక్షరాస్యత 99 శాతం. ఏటా స్టాక్‌హోం నగరంలోని గ్రంథాలయాల నుంచి ఇక్కడి ప్రజలు 40 లక్షల పుస్తకాలు తీసుకుని చదువుతుంటారు. 
* ప్రముఖ ఫర్నీచర్‌ చైన్‌ నెట్‌వర్క్‌ ఐకియా సంస్థ ప్రారంభమైంది ఇక్కడే. 1943లో మొదలైన ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. 
* సైకిళ్ల కోసం ప్రత్యేక దారులుంటాయిక్కడ. రోజూ 70 వేల మందికిపైగా సైకిళ్లపై ప్రయాణిస్తుంటారు.

 

మహా నగరం 

* ఈ నగరంలోని సబ్‌వే ప్రపంచంలోనే పొడవైన ఆర్ట్‌ గ్యాలరీ. ఇందులోని అందమైన చిత్రలేఖనాలు, శిల్పాలు కనువిందు చేస్తుంటాయి. 1950లో ప్రారంభమైందిది.

 

మహా నగరం 

* ఇక్కడ ఇంచుమించు 100 మ్యూజియాలుంటాయి. ఏటా లక్షలాది మంది సందర్శిస్తుంటారు. నోబెల్‌ మ్యూజియమూ ఉంటుంది. ఇందులో నోబెల్‌ బహుమతులకు సంబంధించిన వివరాలన్నీ ఉంటాయి.

 

మహా నగరం 

* ప్రపంచంలోనే అతి పెద్ద అర్ధగోళాకార భవంతి ఉండేది ఇక్కడే. తెల్లని బంతిలా ఉంటుందీ భవనం.

 

మహా నగరం 

* ఈ నగరంలోని అతి పురాతనమైన నిర్మాణం 'ది రిడార్ హొల్మెన్ చర్చ్' 1270 సంవత్సరం నాటిదిది .


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని