డెనిమ్‌ జీన్స్‌ పుట్టిందిక్కడే!  

మెక్సికో-అమెరికా యుద్ధం(1848) ముందు వరకు మెక్సికో దేశంలోని భాగం. అప్పట్లో దీని పేరు యెర్బా బ్యూనా. ఆ తర్వాతే ఇది పేరు మారి అమెరికాలో కలిసిపోయింది. ఈ నగరం మొత్తం 50కిపైగా కొండలపై నిర్మితమైంది. రష్యన్‌, నాబ్‌, టెలిగ్రాఫ్‌, ట్విన్‌ కొండలు.. వాటిలో ప్రముఖమైనవి...

Published : 21 Oct 2018 06:34 IST

మహా నగరం శాన్‌ఫ్రాన్సిస్కో

డెనిమ్‌ జీన్స్‌ పుట్టిందిక్కడే!  

 

నగరం: శాన్‌ఫ్రాన్సిస్కో 
దేశం: అమెరికా 
విస్తీర్ణం: దాదాపు 600 చదరపుకిలో మీటర్లు 
జనాభా: 8 లక్షల 84 వేలకు పైమాటే 
అమెరికాలోని ప్రముఖ నగరాల్లో ఒకటి శాన్‌ఫ్రాన్సిస్కో. ఇది అక్కడి కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉంది. 

డెనిమ్‌ జీన్స్‌ పుట్టిందిక్కడే!  

* ఇది మెక్సికో-అమెరికా యుద్ధం(1848) ముందు వరకు మెక్సికో దేశంలోని భాగం. అప్పట్లో దీని పేరు యెర్బా బ్యూనా. ఆ తర్వాతే ఇది పేరు మారి అమెరికాలో కలిసిపోయింది. 
* ఈ నగరం మొత్తం 50కిపైగా కొండలపై నిర్మితమైంది. రష్యన్‌, నాబ్‌, టెలిగ్రాఫ్‌, ట్విన్‌ కొండలు.. వాటిలో ప్రముఖమైనవి. 
* అందుకనే ఇక్కడ వాలుగా, ఒంపులు ఒంపులు తిరిగి ఉండే వీధులు ఎక్కువ. 
* హైడె, లీవెన్‌వర్త్‌ల మధ్య ఉండే వీధి అతి వాలైనది. 31.5 డిగ్రీలకు వంగి ఉంటుంది. 
* దాదాపుగా జూన్‌, జులై, ఆగస్టుల్లోనే ఇక్కడ మంచు కనిపిస్తుంది. మిగిలిన అమెరికా నగరాలతో పోలిస్తే ఇక్కడ తక్కువ రోజులే మంచు ఉంటుంది. 
* చారిత్రక కట్టడాలకు ఇది నెలవు. 200కి పైగా చారిత్రక భవనాలున్నాయిక్కడ. 
* ఐక్యరాజ్యసమితిని స్థాపించాలన్న ఆలోచన పుట్టిందిక్కడే. ఇక్కడే ఈ ఆలోచనకు ఆమోదమూ లభించింది. సంతకాలు ఇక్కడే చేశారు. 
* దీని విస్తీర్ణంలో 11శాతం పార్కులే ఉన్నాయి. 
* ఆసియా బయట ఉన్న రెండో అతి పెద్ద చైనా టౌన్‌ ఉన్నదిక్కడే. ఇది ఉత్తర అమెరికాలో ఉన్న అతి ప్రాచీన చైనా టౌన్‌. లక్షమందికి పైగా చైనీయులు నివసిస్తున్నారిక్కడ. 
* అమెరికాలో అతి పెద్ద, పాత జపాన్‌ టౌన్‌ ఉన్నదిక్కడే.

లోతులేని తీరం! 
* దీనికి దాదాపుగా 50మైళ్ల సముద్ర తీరం ఉంది. ఈ పసిఫిక్‌ తీరం సొరచేపలకు పెట్టింది పేరు. మనుషుల్ని తినేసే రకాలూ ఇక్కడున్నాయి. 
* ఈ తీరమంతా పెద్దగా లోతు కూడా ఉండదు. దీని సరాసరి లోతు స్విమ్మింగ్‌ పూల్‌ లోతంతేనట. ఎక్కడైనా సరే 12 నుంచి 15 అడుగులలోపే ఉంటుందట. 
* ఇక్కడ రెండు ప్రధానమైన వంతెనల్లో గోల్డెన్‌ గేట్‌ బ్రిడ్జ్‌ ఒకటి. 1933లో దీని నిర్మాణం మొదలుపెట్టి 1937లో పూర్తిచేశారు. 
* ఈ తీర ప్రాంతంలో ఏడాదిలో వందల సార్లు భూకంపాలొస్తుంటాయి. అయితే అవన్నీ రిక్టరు స్కేలుపై మూడులోపే ఉంటాయి. 
* ఎలక్ట్రిక్‌ టీవీని కనిపెట్టింది ఇక్కడే. ఎప్పుడంటే 1927లో. ఎవరంటే ఫిలో ఫ్రాన్‌స్వార్త్‌. 
* ఆహార ప్రియులకిది స్వర్గం. 3,500కి పైగా రెస్టారెంటులున్నాయి. 
*  2014లో జరిగిన ఓ సర్వే ప్రకారం ఇక్కడి కాలుష్యంలో 29శాతం చైనా నుంచి వస్తోందని తేలింది. 
*  ఇక్కడి ఫెడరల్‌ జైలు ఖైదీలకు వేడినీటి షవర్లతో స్నానం చేసే సౌకర్యాన్ని కల్పించింది. చాలా చలిగా ఉండేప్పుడు కొందరు ఖైదీలు ఈ వంకతో తప్పించుకుని పారిపోతుండటంతో ఈ పని చేసింది.

 

డెనిమ్‌ జీన్స్‌ పుట్టిందిక్కడే!  

*మొదట డెనిమ్‌ జీన్స్‌ని పెద్దఎత్తున తయారు చేయడం మొదలు పెట్టింది ఇక్కడే. గోల్డ్‌ రష్‌ కాలంలో మైనర్లకు ఎక్కువ కాలం మన్నే దుస్తుల్ని రూపొందించాలన్న ఉద్దేశంతో వీటిని తయారు చేశారు.

పాత కేబుల్‌కార్లు ‌ 

డెనిమ్‌ జీన్స్‌ పుట్టిందిక్కడే!  

 

* ఇక్కడి చారిత్రక వ్యవస్థల్లో శాన్‌ఫ్రాన్సిస్కో కేబుల్‌కార్లు కూడా ఒకటి. గంటకు 9.5 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఇవి ఇప్పటికీ పని చేస్తున్నాయి.

 

డెనిమ్‌ జీన్స్‌ పుట్టిందిక్కడే!  

*శాన్‌ఫ్రాన్సిస్కో దగ్గర్లో రెడ్‌వుడ్‌ చెట్ల అడవులున్నాయి. ప్రపంచంలో అతి ఎత్తయిన చెట్లు ఇవేనని తెలుసుగా!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని