మహా నగరం: ఆక్లండ్‌ 

నగరం: ఆక్లండ్‌ దేశం: న్యూజీలాండ్‌ విస్తీర్ణం:  1,102 చదరపు కిలోమీటర్లు జనాభా: పదిహేను లక్షలకు పైమాటే ఈ నగర పరిపాలనా వ్యవహారాలన్నింటినీ ఆక్లండ్‌ కౌన్సిల్‌ చూస్తుంది. ఇక్కడ చాలా ఎక్కువ నేల, తక్కువ జనాభా. అందుకే ఇది గతంలో నివాసయోగ్యమైన మంచి నగరాల్లో ఒకటిగా స్థానం దక్కించుకుంది. 2006 నుంచీ టాప్‌ 20లో స్థానం సంపాదించుకుంటోంది. నీలి రంగులో నిర్మలంగా ఉండే సముద్రపు నీరు ఈ నగరానికి అందాన్ని తెచ్చి పెడుతుంది...

Published : 03 Nov 2018 00:10 IST

అగ్ని పర్వతాల చిరునామా!

మహా నగరం: ఆక్లండ్‌ 
 

నగరం: ఆక్లండ్‌ 
దేశం: న్యూజీలాండ్‌ 
విస్తీర్ణం:  1,102 చదరపు కిలోమీటర్లు 
జనాభా: పదిహేను లక్షలకు పైమాటే 
* ఈ నగర పరిపాలనా వ్యవహారాలన్నింటినీ ఆక్లండ్‌ కౌన్సిల్‌ చూస్తుంది. 
* ఇక్కడ చాలా ఎక్కువ నేల, తక్కువ జనాభా. అందుకే ఇది గతంలో నివాసయోగ్యమైన మంచి నగరాల్లో ఒకటిగా స్థానం దక్కించుకుంది. 2006 నుంచీ టాప్‌ 20లో స్థానం సంపాదించుకుంటోంది. 
* నీలి రంగులో నిర్మలంగా ఉండే సముద్రపు నీరు ఈ నగరానికి అందాన్ని తెచ్చి పెడుతుంది. 

మహా నగరం: ఆక్లండ్‌ 

* వేసవిలోనూ ఉష్ణోగ్రత సరాసరిన 20 నుంచి 30 డిగ్రీల సెల్సియస్‌ మాత్రమే ఉంటుంది. చలికాలంలో అయితే 8 నుంచి 15 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. 
* ప్రతి ముగ్గురు ఆక్లండ్‌ వాసుల్లో ఒకరికి సొంత బోటు ఉంది. 
* రకరకాల చోట్ల నుంచి వచ్చిన వారితో, విభిన్న భాషలు మాట్లాడే వారితో ఈ నగరం నిండి ఉంటుంది. 
* ఈ నగరం మొత్తంలో 50 వరకూ అగ్ని పర్వతాలున్నాయి. భయపడక్కర్లేదులేండి. అవన్నీ ఇప్పుడు పేలే స్థితిలో లేనట్లే. గతంలో ఎప్పుడో చిందిన లావా, మాగ్మాలతో ఇప్పుడు ఇక్కడ అందమైన మైదానాలు ఏర్పడ్డాయి. ఆ అగ్ని పర్వత బిలాల్ని ఇప్పటికీ మనం చక్కగా చూడొచ్చు. 
* దాదాపు 40వేల హెక్టార్లలో పార్కులున్నాయి. 
* ఏటా 20లక్షల మందికి పైగా పర్యటకులు ఇక్కడికి వస్తున్నారు. 
* మావోరీలకు సంబంధించిన చాలా వస్తువులు ఇక్కడి ఆక్లండ్‌ మ్యూజియంలో ఇప్పటికీ ఉన్నాయి. 
* ఇక్కడ ఎక్కువగా ఆడే ఆటలు రగ్బీ, క్రికెట్‌, హైకింగ్‌, ఫుట్‌బాల్‌, బాస్కెట్‌బాల్‌, స్కీయింగ్‌, వైట్‌వాటర్‌ రేఫ్టింగ్‌. 
* సహజసిద్ధంగా ఏర్పడిన రెండు హార్బర్‌ల మధ్యలో ఈ నగరం ఉంటుంది. పసిఫిక్‌ సముద్రం నుంచి 16 కిలోమీటర్లు నడిస్తే టాస్మాన్‌ సముద్రం వచ్చేస్తుంది. మధ్యలో ఉండే కొండలు, గుట్టలు ఎక్కుతూ చాలా మంది హైకింగ్‌ చేస్తూ తీరం నుంచి మరో తీరానికి  వెళతారు. 


మహా నగరం: ఆక్లండ్‌ 

న్యూజీలాండ్‌ దేశంలోని పెద్ద నగరాల్లో ఒకటి ఆక్లండ్‌. 
* దీని అసలు పేరు తమాకి మాకురావ్‌. 1350ల్లో ఇక్కడకొచ్చి మొదట స్థిరపడ్డవారు మావోరీలు. తర్వాత యూకే, ఉత్తరకొరియా, చైనా, భారత్‌, జింబాంబ్వే, దక్షిణాఫ్రికా, అమెరికా, పసిఫిక్‌ ద్వీప దేశాల నుంచి వలసదారులుగా వెళ్లి చాలా మంది స్థిరపడ్డారు. 
* ఇది 1842 నుంచి 1865 వరకు న్యూజీలాండ్‌ రాజధానిగా ఉంది. పరిపాలనా వ్యవహారాలు చూసుకోవడానికి ప్రయాణం ఇబ్బందిగా మారిందని భావించి తర్వాత రాజధానిని వెల్లింగ్‌టన్‌కు మార్చారు. 
* దీనికి ‘సిటీ ఆఫ్‌ సెయిల్స్‌’ అనే పేరూ ఉంది. సెయిలర్లను ఎక్కువ ఆకర్షిస్తుండటంతో దీనికీ పేరొచ్చింది. ఎటు చూసినా నీరు కనిపిస్తుంటుంది. పర్వతాలు, మడ అడవులతో నిండి ఉంటుంది. 


మహా నగరం: ఆక్లండ్‌ 

* దక్షిణార్ధ గోళంలోనే అతి ఎత్తయిన టవర్‌ ఉన్నదిక్కడే. దీని పేరు ‘ద స్కై టవర్‌’. 328 మీటర్ల ఎత్తుంటుంది. ఇదెక్కి చూస్తే ఆక్లండ్‌ చుట్టుపక్కల 80 కిలోమీటర్ల మేర చక్కగా కనిపిస్తుంది. దీంట్లో మంచి మంచి రెస్టారెంటులూ ఉన్నాయి.


పెంగ్విన్లను చూడొచ్చు!

మహా నగరం: ఆక్లండ్‌ 

* రకరకాల పెంగ్విన్‌ జాతులు ఇక్కడ పెరుగుతున్నాయి. అంటార్కిటికా బయట వీటిని మనం ఇక్కడ చూడొచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని