శాంతి ఇచ్చేదక్కడే!

నార్వే దేశ రాజధాని నగరం ఓస్లో. ఒక వ్యాపార కేంద్రాన్ని ఏర్పరిచేందుకు దీన్ని క్రీస్తు శకం 1000లోనే స్థాపించారు...

Published : 08 Dec 2018 00:33 IST

మహా నగరం 
ఓస్లో 

శాంతి ఇచ్చేదక్కడే!

నగరం: ఓస్లో 
దేశం: నార్వే 
జనాభా: ఆరు లక్షల 73వేలకు పైనే 
విస్తీర్ణం: దాదాపు 480 చదరపు కిలోమీటర్లు 
నార్వే దేశ రాజధాని నగరం ఓస్లో. ఒక వ్యాపార కేంద్రాన్ని ఏర్పరిచేందుకు దీన్ని క్రీస్తు శకం 1000లోనే స్థాపించారు. 
* ప్రపంచ అందమైన నగరాల్లో ఓస్లో ఒకటి. 
శాంతి ఇచ్చేదక్కడే!
* దీని విస్తీర్ణంలో 242 చదరపు కిలోమీటర్ల మేర అడవే విస్తరించి ఉంది. 
* ఇక్కడ 343 సరస్సులున్నాయి. 
* ఉత్తర ధ్రువానికి నార్వే దగ్గరగా ఉంటుంది. ఆరు నెలలు సూర్యుడు ఈ ధ్రువానికి దగ్గరగా ఉంటాడు. దీంతో వేసవిలో ఓస్లోలో ఎప్పుడూ పూర్తిగా చీకటి రాదు. రాత్రీ వెలుతురుంటుంది. 
* ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం నివసించడానికి అత్యుత్తమమైన నగరం ఇది. మానవాభివృద్ధి సూచీలోనూ ముందుంది. 

* నిరుద్యోగం చాలా తక్కువ. ఖరీదైన నగరాల్లో ఒకటి. 
* ఇక్కడ చల్లని వాతావరణమే ఉంటుంది. సరాసరిన వేసవిలో అంటే.. జూన్‌, జులై, ఆగస్టుల్లో అత్యధికంగా 21డిగ్రీల సెల్సియస్‌ ఉంటుంది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఉష్ణోగ్రతలు ఎప్పుడూ మైనస్‌ డిగ్రీల్లోనే ఉంటాయి. 
* ఇక్కడున్న పర్యటక ప్రాంతాల్ని చూసేందుకు ఏటా కోటి మందికి పైగా వస్తుంటారు.

సముద్రతీరం!

శాంతి ఇచ్చేదక్కడే!

ఈ నగరం ఆగ్నేయ భాగాన్ని ఓస్లోఫ్జోర్డ్‌ పేరుతో పిలుస్తారు.  ఇక్కడ కొంత భాగంలోకి సముద్రం చొచ్చుకుని వచ్చి ఉంటుంది. అందుకే ఈ తీరంలో ఇంచుమించు 40 దీవులున్నాయి. చుట్టూ కొండలు, అడవులు, బీచ్‌లతో ఈ ప్రాంతం మనోహరంగా ఉంటుంది. దీంతో ఇది ప్రధాన పర్యటక ఆకర్షణ.

ఓస్లో సిటీహాల్‌

శాంతి ఇచ్చేదక్కడే!

* దీని పేరు వినబడగానే అందరికీ గుర్తొచ్చేది నోబెల్‌ శాంతి బహుమతే. ఎందుకంటే ఏటా డిసెంబర్‌ 10న దీంట్లోనే ఈ బహుమతుల ప్రదానోత్సవం జరుగుతుంది. 
* స్ట్రక్చర్‌ ఆఫ్‌ ద సెంచరీ అనే పేరూ ఉంది దీనికి. 1931-1950ల మధ్యలో దీన్ని నిర్మించారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వ్యవహారాలన్నింటినీ ఓస్లో మున్సిపాల్టీ చూసుకుంటుంది.

విగ్రహాల పార్కు!

శాంతి ఇచ్చేదక్కడే!

 

* విగలాండ్‌ స్పార్కెన్‌ స్కల్పచర్‌ పార్కు... పేరు వింటేనే అర్థమవుతోంది కదూ. దీనిలోపల ఎక్కడ చూసినా విగ్రహాలే కనిపిస్తాయని. 
* మొత్తం 212 కాంస్య, గ్రానైట్‌ విగ్రహాలున్నాయిక్కడ. 
* ఇలాంటి పార్కుల్లో ఇది ప్రపంచంలోనే అతిపెద్దది.   
* ఇవన్నీ ఒకే వ్యక్తి చేయడం విశేషం. ఆయన పేరు గుస్తావ్‌ విగలాండ్‌.

నేషనల్‌ థియేటర్‌

శాంతి ఇచ్చేదక్కడే!

క్కడో నేషనల్‌ థియేటర్‌ ఉంది. ఇది నార్వేలోనే అతిపెద్ద థియేటర్‌. 1899లో నిర్మించారు. ఇందులో సినిమాలు వేస్తారనుకుంటే పొరపాటేనండోయ్‌. సాంస్కృతిక కార్యక్రమాలకు ఇందులో వేదికలుంటాయి.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని