ఈ పాప్‌కార్న్‌ని చూడగలం.. తినలేం !

పాప్‌కార్న్‌ అంటే మనకు భలే ఇష్టం కదూ... ఓ దగ్గరేమో బీచ్‌ అంతా పాప్‌ కార్న్‌తో నిండిపోయింది... అబ్బ.. తినేద్దాం అనుకుంటే కార్న్‌లో కాలేసినట్లే... ఎందుకంటే అది తినలేనిది మరి...  ఎందుకో? అదెక్కడో? ఏంటో? బీచ్‌ అంటే మనందరికీ ముందుగా...

Published : 12 Dec 2018 01:13 IST

ఈ పాప్‌కార్న్‌ని చూడగలం.. తినలేం !

పాప్‌కార్న్‌ అంటే మనకు భలే ఇష్టం కదూ... ఓ దగ్గరేమో బీచ్‌ అంతా పాప్‌ కార్న్‌తో నిండిపోయింది... అబ్బ.. తినేద్దాం అనుకుంటే కార్న్‌లో కాలేసినట్లే... ఎందుకంటే అది తినలేనిది మరి...  ఎందుకో? అదెక్కడో? ఏంటో? బీచ్‌ అంటే మనందరికీ ముందుగా గుర్తొచ్చేసేది ఇసుకే కదా. కానీ ఓ బీచ్‌ని గుర్తు తెచ్చుకుంటే మాత్రం ఇసుకకు బదులుగా పాప్‌కార్న్‌ గుర్తొస్తుంది. నిజ్జంగానా? అనకండి. ఎందుకంటే అది అబద్ధపు పాప్‌కార్న్‌ మరి. 
 

ఈ పాప్‌కార్న్‌ని చూడగలం.. తినలేం !

* ఈ బీచ్‌ ఎక్కడుందంటే స్పెయిన్‌లో. అక్కడున్న కేనరీ దీవుల్లో. 
* మామూలుగా ఈ దీవులన్నీ అందమైన ఇసుక బీచ్‌లకు పెట్టింది పేరు. కానీ అక్కడున్న ఓ బీచ్‌కి మాత్రం పాప్‌కార్న్‌ బీచ్‌ అని పేరు. ఎందుకంటే ఆ తీరమంతా పాప్‌కార్న్‌ని పోలినవి ఉంటాయి. 
* తెల్లటి పేలాల్లాంటివి లక్షలాదిగా బీచ్‌ అంతా పరుచుకుని ఉంటాయి. ఒక్కసారిగా చూస్తే బోలెడు పేలాల్ని తెచ్చి ఎవరైనా బీచ్‌లో కుమ్మరించారా? అని సందేహం వచ్చేస్తుంది. 
* కానీ అవన్నీ అచ్చమైన పేలాలూ కావు. ఇసుకా కాదు. రాళ్లూ కావు. 
* అయితే అసలు వీటి రహస్యమేంటి? ఇవన్నీ ఇలా పేలాల్లా ఎందుకు ఉన్నాయి అంటే? పెద్ద కారణాలేం లేవు. అవి ఓ రకమైన చిన్న పగడపు దిబ్బలట. అవే ఈ తీరంలో పరుచుకుని ఇలా అలరిస్తున్నాయట. 
* అయితే ఈ తీరంలో కూర్చుని సేద తీరదామంటే ఈ పాప్‌కార్న్‌ల ఇసుక అంత సౌకర్యంగా ఉండవు. అయినా సరే అచ్చంగా వీటిని చూడ్డానికే పర్యటకులు ఈ తీరానికి వస్తుంటారు. భలే ఉంది కదూ. మనమూ చూసొద్దామా!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని