సైకిళ్ల మీదే ఉద్యోగాలకు !

నగరం: కోపెన్‌హాగన్‌దేశం: డెన్మార్క్‌జనాభా: ఏడున్నర లక్షలకు పైమాటేవిస్తీర్ణం: 178 చదరపు కిలోమీటర్లు.డెన్మార్క్‌ దేశ రాజధాని నగరం కోపెన్‌హాగన్‌. పూర్వం ఇదో జాలర్ల గ్రామం. నౌకాశ్రయం ఉండటంతో సముద్రపు దొంగలు చాలాసార్లు ఈ ఊరు మీద పడి దోచేసేవారు. అలాంటి చోటే ఇప్పుడిలా మహానగరంగా మారిపోయింది.* పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ఇప్పుడీ నగరం చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. పవన, సౌర విద్యుత్తులనే వాడుతోంది. ఫలితంగా అంతకు ముందున్న ఉద్గారాలు మూడొంతులు తగ్గిపోయాయి.* కొన్నేళ్ల నుంచి ఇక్కడ ఖాళీ స్థలాలన్నింటినీ ప్రభుత్వం పార్కులుగా మారుస్తూ వస్తోంది. ప్రజల్ని పచ్చదనానికి దగ్గర చెయ్యాలనే పాకెట్‌ పార్కుల పేరుతో చిన్న చిన్న పార్కుల్ని తయారు చేసేస్తోంది. అందుకే ఇక్కడ చెట్లు, మొక్కలు ఎక్కువగానే కనిపిస్తుంటాయి....

Updated : 29 Dec 2018 00:44 IST

మహా నగరం
కోపెన్‌హాగన్‌

సైకిళ్ల మీదే ఉద్యోగాలకు !


నగరం: కోపెన్‌హాగన్‌
దేశం: డెన్మార్క్‌
జనాభా: ఏడున్నర లక్షలకు పైమాటే
విస్తీర్ణం: 178 చదరపు కిలోమీటర్లు
డెన్మార్క్‌ దేశ రాజధాని నగరం కోపెన్‌హాగన్‌. పూర్వం ఇదో జాలర్ల గ్రామం. నౌకాశ్రయం ఉండటంతో సముద్రపు దొంగలు చాలాసార్లు ఈ ఊరు మీద పడి దోచేసేవారు. అలాంటి చోటే ఇప్పుడిలా మహానగరంగా మారిపోయింది.
* పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ఇప్పుడీ నగరం చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. పవన, సౌర విద్యుత్తులనే వాడుతోంది. ఫలితంగా అంతకు ముందున్న ఉద్గారాలు మూడొంతులు తగ్గిపోయాయి.
* కొన్నేళ్ల నుంచి ఇక్కడ ఖాళీ స్థలాలన్నింటినీ ప్రభుత్వం పార్కులుగా మారుస్తూ వస్తోంది. ప్రజల్ని పచ్చదనానికి దగ్గర చెయ్యాలనే పాకెట్‌ పార్కుల పేరుతో చిన్న చిన్న పార్కుల్ని తయారు చేసేస్తోంది. అందుకే ఇక్కడ చెట్లు, మొక్కలు ఎక్కువగానే కనిపిస్తుంటాయి.

*ఇప్పుడు ‘వరల్డ్‌ హాపీయెస్ట్‌ సిటీస్‌’లో ఇదొకటి. ఇక్కడి ప్రజలు బయటి వారితోనూ చాలా స్నేహపూర్వకంగా ఉంటారు.
* ప్రపంచంలో అతి పురాతన అమ్యూజ్‌మెంట్‌ పార్కుగా ఇక్కడి బాకెన్‌కు పేరుంది. దీన్ని 1883లోనే కట్టేశారు. ఈ పార్కులో ఒకచోట నుంచి ఇంకో చోటికి వెళ్లడానికీ రోలర్‌కోస్టర్‌లలాంటి రైడ్లుంటాయి.
*ఇక్కడున్న కోపెన్‌హాగన్‌ విశ్వవిద్యాలయానికి సొంత కోర్టు, చట్టాలు ఉండేవి. సొంతంగా ఓ జైలూ ఉండేది. 1771 తర్వాత ఈ విశ్వవిద్యాలయం ఈ నగర పాలన కిందికి వచ్చింది. దీంతో ఆ చట్టాలన్నీ తొలగిపోయాయి.
*సాకర్‌, హ్యాండ్‌బాల్‌లను వీరు ఇష్టంగా ఆడుతుంటారు.

సైకిళ్ల మీదే ఉద్యోగాలకు !

*రోడ్ల పక్కన చాలా మంది సైకిళ్లకు తాళాలు వెయ్యకుండానే పెట్టేస్తారు.
*ఒక్కోసారి కూడళ్లలో సైకిళ్ల వల్ల ట్రాఫిక్‌ జామ్‌లు అయిపోతుంటాయి.

సైకిళ్ల మీదే ఉద్యోగాలకు !

*నగరం మధ్యలో ఉన్న స్ట్రోగెట్‌ షాపింగ్‌ స్ట్రీట్‌ ఎక్కువ మంది పర్యటకుల్ని ఆకర్షించే ప్రాంతం. అయితే ఇది ప్రారంభమైన మొదట్లో ఈ చుట్టుపక్కల పార్కింగ్‌కి ఇబ్బందయ్యేది. విపరీతంగా ట్రాఫిక్‌ జామ్‌లయ్యేవి. దీంతో స్థానికులంతా దీన్ని వ్యతిరేకించారు. దీన్ని వెంటనే తొలగించేయమంటూ మేయర్‌ని బెదిరించారు. అయితే వాళ్లని ఒప్పించి రెండేళ్లపాటు ట్రయల్‌ నిర్వహించారు. దీంతో తర్వాత్తర్వాత స్థానికులు దీన్ని ఇష్టపడటం మొదలుపెట్టారు.

జామ్‌ జామ్మంటూ!

సైకిళ్ల మీదే ఉద్యోగాలకు !

* ఈ నగరంలో నివసించేవారిని కోపెన్‌హాగనర్స్‌ అని పిలుస్తుంటారు. వీరికి సైకిళ్లంటే భలే ఇష్టం.
* ఉద్యోగుల్లో సగం మందికి పైగా రోజూ సైకిళ్ల మీదే వెళతారు.
* ఇక్కడ 250 మైళ్ల సైకిల్‌ దారులున్నాయి. ఈ ఊరి శివారుల్లో ఉన్న ఊళ్లను కలపడానికి ఇప్పుడో సూపర్‌ హైవేనీ తెరిచారు. దాని మీద ఇంక వేరే పెద్ద వాహనాలేం రావన్న మాట.

సైకిళ్ల మీదే ఉద్యోగాలకు !

*నగరం మొత్తంలో అక్కడక్కడా కృత్రిమంగా నిర్మించిన ద్వీపాలుంటాయి. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో వీటిని భద్రతా అవసరాల కోసం నిర్మించారు. అయితే ఇప్పటికీ అవి మిలటరీ బేస్‌లుగా ఉన్నాయి.
*ప్రభుత్వ నిబంధనలు, చట్టాల్ని ఇక్కడి వారంతా కచ్చితంగా పాటిస్తారు. రోడ్డు ఖాళీగా ఉన్నా పచ్చలైటు పడే వరకు ఆగుతారు. దొంగతనాలూ తక్కువే.

సైకిళ్ల మీదే ఉద్యోగాలకు !

*కోపెన్‌హాగన్‌ తీరంలో ఉన్న ఓడరేవుకు పరిశుభ్రమైనదిగా పేరుంది. ఇక్కడి నీళ్లూ దిగి స్నానం చేసేందుకు వీలైనంత స్వచ్ఛంగా ఉంటాయి. అయితే ఎప్పుడూ ఈ నీళ్లు ఇలాగే లేవు. పదిహేనేళ్ల క్రితం అధికారులు వీటిని శుభ్రంగా ఉంచాలని అనుకున్నారట. అక్కడక్కడా ఈతకు వీలుగా ఏర్పాట్లు చేసి నిబంధనల్ని అమలు చేశారు. దీంతో అప్పటి నుంచి ఇది శుభ్రమైనదిగా మారింది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని