మనకిది చలి.. వారికిదే వేడి!

మనం ఈ కాస్త చలికే వణికిపోతున్నాం...ఇంతకంటే దారుణమైన చలిలో ఏడాదంతా ఉంటుందో నగరం...అందుకే అది ప్రపంచంలోనే అత్యంత చలిగా ఉండే సిటీ అయ్యింది...ఇంతకీ ఏంటది...?ఎక్కడుంది...?ఏమా విశేషాలు...?ఏడాదికి 365 రోజులు.. అందులో 270 రోజులు ఓ నగరమంతా మంచుతో కప్పే ఉంటుంది. 120 రోజులు మంచు తుపానులు చెలరేగిపోతూనే ఉంటాయి.అంటే సరాసరిన ప్రతి మూడు రోజుల్లో ఒకరోజు మంచు తుపానే....

Published : 09 Jan 2019 00:18 IST

మనకిది చలి.. వారికిదే వేడి!

మనం ఈ కాస్త చలికే వణికిపోతున్నాం...
ఇంతకంటే దారుణమైన చలిలో ఏడాదంతా ఉంటుందో నగరం...
అందుకే అది ప్రపంచంలోనే అత్యంత చలిగా ఉండే సిటీ అయ్యింది...
ఇంతకీ ఏంటది...?
ఎక్కడుంది...?
ఏమా విశేషాలు...?
డాదికి 365 రోజులు.. అందులో 270 రోజులు ఓ నగరమంతా మంచుతో కప్పే ఉంటుంది. 120 రోజులు మంచు తుపానులు చెలరేగిపోతూనే ఉంటాయి.
అంటే సరాసరిన ప్రతి మూడు రోజుల్లో ఒకరోజు మంచు తుపానే.
మరి అక్కడి ప్రజలు ఇంకెలా ఉంటారు? అసలా నగరమేంటి? అంటే?
* ఈ సిటీ పేరు నోరిల్కస్‌. రష్యాలోని సైబీరియా ప్రాంతంలో, ఆర్కిటిక్‌ వలయంలో ఉందిది.
* అంటార్కిటికా బయట ప్రపంచంలో ఇదే అత్యంత చలిగా ఉండే నగరం.
* మన రాష్ట్రాల్లో చలికాలంలో 14, 15 డిగ్రీల ఉష్ణోగ్రత రాత్రి పూట నమోదవుతుంటుంది. మరిదే ఉష్ణోగ్రత నోరిల్కస్‌లో ఒకనెల మాత్రమే ఉండే వేసవిలో నమోదవుతుంది. ఇక్కడ ఏడాది సరాసరి ఉష్ణోగ్రత -9 డిగ్రీలు.
* ఇదో మైనింగ్‌ సిటీ. లక్షా 75 వేల మందికిపైగా జనాభా ఉన్నారు. ఏడాదిలో దాదాపుగా 250 రోజులు అసలు సూర్యుడి ముఖమే కనిపించదు.
* ఇక్కడ అత్యధికంగా నికెల్‌ నిక్షేపాలున్నాయి. వాటి మైనింగ్‌ కోసమే ఈ నగరం 1935లో ఏర్పడింది. ముడి నికెల్‌ని తీసి అక్కడే ఫ్యాక్టరీల్లో శుద్ధి చేస్తారు. అందుకే ఇది అత్యంత కాలుష్యపూరితమైన ఊరు కూడా.
* అసలే చలి, ఆ పైన కాలుష్యం. ఎక్కడా చెట్లూ కనిపించవు. పైగా ఇతర ప్రాంతాలతో సంబంధం లేకుండా ఎక్కడో సైబీరియా ఖాళీ మైదానాల్లో ఉంటుంది.

మనకిది చలి.. వారికిదే వేడి!

* రోడ్లుంటాయిగానీ మంచు కప్పేసి ఉండే సరికి చలిలో వారికి సుదూరం ప్రయాణించే వీలే ఉండదు.
* ఇక్కడ మిడ్‌నైట్‌ సన్‌(రాత్రి సూర్యుడు కనిపించడం), పోలార్‌ నైట్స్‌ (కొన్ని రోజుల పాటు మొత్తం రాత్రే ఉండటం) అనే రెండు అరుదైన వాతావరణ తీరులూ కనిపిస్తాయి.
* చాలా మంది సైబీరియాలోని మరో సిటీ యాకుత్స్‌క్‌ ప్రపంచంలోనే చలిగా ఉండే నగరమని వాదిస్తుంటారు. కానీ ఏడాది మొత్తం మీద సరాసరి ఉష్ణోగ్రత చూసుకుంటే ఇక్కడే తక్కువ.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని