జవానులకు ప్రణామం!

హాయ్‌ ఫ్రెండ్స్‌... ఎప్పుడెప్పుడు నేను వస్తానా? ఏ కబుర్లు తెస్తానా? అని ఎదురు చూస్తున్నారు కదూ... మరేమో ఈసారి నేను వెళ్లిన చోటు ఓ వీరజవానుల జ్ఞాపకం...  మనదేశంలో చూడదగ్గ ప్రదేశం... దేశం రాజధాని ఆకర్షణ... హా.. అదేనండీ ఇండియా గేట్‌!

Published : 17 Jan 2019 00:26 IST

జవానులకు ప్రణామం!

హాయ్‌ ఫ్రెండ్స్‌... ఎప్పుడెప్పుడు నేను వస్తానా? ఏ కబుర్లు తెస్తానా? అని ఎదురు చూస్తున్నారు కదూ... మరేమో ఈసారి నేను వెళ్లిన చోటు ఓ వీరజవానుల జ్ఞాపకం...  మనదేశంలో చూడదగ్గ ప్రదేశం... దేశం రాజధాని ఆకర్షణ... హా.. అదేనండీ ఇండియా గేట్‌!

కట్టడం: ఇండియా గేట్‌
నిర్మాణం: 1921 - 1931
ఎక్కడ: దిల్లీ

ఎందుకు కట్టారు?

జవానులకు ప్రణామం!మరేమో అప్పట్లో మనదేశం బ్రిటిష్‌వాళ్ల పాలనలో ఉండేది కదా! బ్రిటిష్‌ వాళ్ల సైన్యంలో భారతీయులు కూడా ఉండేవాళ్లు. 1914 నుంచి 1918 వరకు జరిగిన మొదటి ప్రపంచ యుద్ధంలో భారతీయ సైనికులు కూడా  పాల్గొన్నారు. అలా బ్రిటిష్‌ వాళ్ల వైపు పోరాడుతూ సుమారు 70 వేల మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మొదటి ప్రపంచ యుద్ధంలో తమ విజయం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికుల గుర్తుగా ఏదైనా కట్టడాన్ని నిర్మించాలనుకున్నారు. ఈ ఆలోచనకు ఫ్రాన్సు దేశంలోని ‘తి౯‘ ్ట’ గి౯i్న్ఝ్ప్త’’  కట్టడాన్ని ప్రేరణగా తీసుకున్నారు. ఆ తర్వాత జరిగిన అఫ్గాన్‌ యుద్ధంలోనూ పది వేల వరకు మన జవానులు ప్రాణాలు విడిచారు. వారి జ్ఞాపకార్థంగానే ఈ అద్భుతమైన
కట్టడాన్ని నిర్మించారు. ఈ నిర్మాణంపై యుద్ధంలో మరణించిన అమరజవానుల పేర్లు కూడా లిఖించారు.

ఎలా ఉంటుంది?

ఎత్తు 138 అడుగులు. దీనిని పాల రాయి, ఎర్ర ఇసుక రాయితో నిర్మించారు. యుద్ధం చేస్తూ చనిపోయిన భారతీయ సైనికుల స్మృతి చిహ్నంగా దీన్ని నిర్మించారన్న విషయం గేట్‌ పైభాగంలో చెక్కి ఉంచారు.

ఎప్పుడు?

ఇండియా గేట్‌ నిర్మాణం 1921లో ప్రారంభమై 1931లో ముగిసింది. అంటే దాదాపు పదేళ్లు.

ఎవరి ఆలోచన?

కట్టడాన్ని డిజైన్‌ చేసింది అప్పటి ప్రఖ్యాత ఆర్కిటెక్ట్‌ ఎడ్విన్‌ లుట్యెన్స్‌.

ఇంకా ఏమైనా!

జవానులకు ప్రణామం!

1971లో జరిగిన భారత్‌ పాక్‌ యుద్ధం తర్వాత ఈ కట్టడం కింది భాగాన అమర్‌ జవాన్‌ జ్యోతిని ఏర్పాటు చేశారు. ఇది ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది. ఈ జ్యోతిని 1971లో భారత్‌ పాకిస్థాన్‌ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల స్మృతికి అంకితంగా వెలిగించారు. దీనికి కొంచెం దూరంలోనే 70 అడుగుల ఎత్తయిన ఎర్రరాయి మండపం ఉంటుంది. ఇందులో అప్పటి బ్రిటిష్‌ రాజు జార్జి-‌్ర విగ్రహం ఉండేది. స్వాతంత్య్రం వచ్చాక ఆయన విగ్రహాన్ని తొలగించారు.

రిపబ్లిక్‌ డే!

ఏటా జనవరి 26న రిపబ్లిక్‌ డే సందర్భంగా జరిగే పరేడ్‌.. రాష్ట్రపతి భవన్‌ దగ్గర మొదలై ఇండియా గేట్‌ నుంచిసాగుతుంది.

పిల్లల పిక్నిక్‌!

దిల్లీలో చిన్న పిల్లలు బాగా ఇష్టపడే పిక్నిక్‌ పాయింట్‌ ఇదేనట. ఏటా లక్షల్లో పర్యటకులు వస్తుంటారు.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని