మాయా జలపాతాలు !

రెండు జలపాతాలున్నాయి .. ఎప్పుడూ గడ్డ కట్టినట్టే  ఉంటాయి ...  కానీ చుట్టూ వేడి వాతావరణమే ... మరీ అవెందుకలా కనిపిస్తాయి ... అసలవి ఎక్కడున్నాయి ? ఏమా సంగతులు ?చూస్తే పెద్ద జలపాతమేదో కిందికి దూకుతున్నట్లే ఉంటుంది. అక్కడ మాత్రం కొంచెం నీళ్లే కనిపిస్తుంటాయి. దూరం నుంచి చూస్తే గడ్డకట్టిన పెద్ద జలపాతంలా అనిపిస్తుంది. దగ్గరకెళితే  రాయే పారే ప్రవాహంలా కనుమాయ చేసేస్తుంది. ఏంటో ఇదంతా..  గజిబిజిగా ఉందే అనిపిస్తోందా? నిజంగానే రెండు జలపాతాలు ఇలాంటి చిత్రమైన తీరుతో ఉన్నాయి....

Updated : 25 Jan 2019 00:22 IST

రెండు జలపాతాలున్నాయి .. ఎప్పుడూ గడ్డ కట్టినట్టే  ఉంటాయి ...  కానీ చుట్టూ వేడి వాతావరణమే ... మరీ అవెందుకలా కనిపిస్తాయి ... అసలవి ఎక్కడున్నాయి ? ఏమా సంగతులు ?
చూస్తే పెద్ద జలపాతమేదో కిందికి దూకుతున్నట్లే ఉంటుంది. అక్కడ మాత్రం కొంచెం నీళ్లే కనిపిస్తుంటాయి. దూరం నుంచి చూస్తే గడ్డకట్టిన పెద్ద జలపాతంలా అనిపిస్తుంది. దగ్గరకెళితే  రాయే పారే ప్రవాహంలా కనుమాయ చేసేస్తుంది. ఏంటో ఇదంతా..  గజిబిజిగా ఉందే అనిపిస్తోందా? నిజంగానే రెండు జలపాతాలు ఇలాంటి చిత్రమైన తీరుతో ఉన్నాయి.
* ఇంతకీ ఈ వింత జలపాతాలు ఎక్కడున్నాయంటే మెక్సికో మధ్యలో ఉన్న ఒక్సాకా సిటీకి దగ్గర్లో.

* హైర్‌వీల్‌ అగువా జలపాతాలని వీటికి పేరు. స్పానిష్‌ భాషలో ఆ పేరుకు అర్థం మరిగే నీరని. మళ్లీ ఈ రెండింటిలో పెద్దదానికి కస్కాడా గ్రాండె అనీ, చిన్నదానికి కస్కాడా చిచా అనీ పేరు.
* ఇక్కడున్న కొండపై వేడి నీటి చలమలున్నాయి. అవే ఒక్కోసారి లోయలో వరకూ ప్రవహిస్తుంటాయి. చూస్తే మాత్రం పెద్ద జలపాతమేదో కిందికి దూకుతున్నట్లే అనిపిస్తుంది.

* దానికీ ఓ కారణముంది. ఈ నీటిలో ఖనిజాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కాల్షియం కార్బొనేట్‌తోపాటు ఇతర ఖనిజాలూ ఎక్కువే. అందుకే వందల ఏళ్లుగా ఈ నీరు కొండ నుంచి కిందికి ప్రవహించేసరికీ ఆ ఖనిజాలూ నీటితోపాటే ప్రవహించి ఇలా జలధారల్లా గట్టిగా మారాయి.
* చూస్తే అక్కడ రాళ్లు కాకుండా జలపాతమే గడ్డకట్టినట్లు కనిపిస్తుందన్నమాట. అందుకే ఇదో ప్రముఖ పర్యటక ప్రాంతం కూడా. అక్కడున్న వేడి నీటి బుగ్గల్లోని నీటిలో స్నానం చేస్తే రోగాలు నయమవుతాయట. అందుకే అక్కడికెళ్లిన వారంతా.. ఆ నీళ్లలో స్నానం చేస్తూ ఆనందించేస్తుంటారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని