ఎన్నెన్నో వ‌ర్ణాల స‌ర‌స్సు!

అన‌గ‌న‌గా ఓ స‌రస్సుంది... ఉప్పు మ‌డుల‌తో ఉంటుంది.... రంగులు మారుతుంటుంది... చిత్రం చేసేస్తుంటుంది... అలా ఎందుక‌బ్బా అంటే!ఉప్పు నీటి సరస్సంటే ఉప్పు మడులతో తెల్లగా ఉంటుందనుకుంటాం. కానీ ఊసరవెల్లిలా రంగులు మారుస్తుందనుకుంటామా? అయితే అలాంటిదే ఒకటుంది. దానిలోని మడులు ఒక్కోసారి ఒక్కో రంగులో కనిపిస్తుంటాయి. ఓసారి పచ్చగా, ఇంకోసారి గులాబీ రంగులో, మరోసారి గోధుమ రంగులో... ఇలాగన్నమాట....

Published : 01 Feb 2019 00:12 IST

అన‌గ‌న‌గా ఓ స‌రస్సుంది... ఉప్పు మ‌డుల‌తో ఉంటుంది.... రంగులు మారుతుంటుంది... చిత్రం చేసేస్తుంటుంది... అలా ఎందుక‌బ్బా అంటే!
ఉప్పు నీటి సరస్సంటే ఉప్పు మడులతో తెల్లగా ఉంటుందనుకుంటాం. కానీ ఊసరవెల్లిలా రంగులు మారుస్తుందనుకుంటామా? అయితే అలాంటిదే ఒకటుంది. దానిలోని మడులు ఒక్కోసారి ఒక్కో రంగులో కనిపిస్తుంటాయి. ఓసారి పచ్చగా, ఇంకోసారి గులాబీ రంగులో, మరోసారి గోధుమ రంగులో... ఇలాగన్నమాట.
* ఎన్నెన్నో వర్ణాలుండే ఈ సరస్సు చైనాలోని యంగ్‌చెన్‌ సిటీలో ఉంది.
* ఈ నగరంలోని కొంత భాగమంతా లోతట్టు ప్రాంతం. డెడ్‌ సీ నుంచి వచ్చే ఉప్పు నీరంతా అక్కడికి చేరుకుంటుంది. దీంతో అక్కడ సరస్సు ఏర్పడింది. దీంట్లో మడులు కట్టి ఉప్పు సాగు చేస్తారు. అయితే ఒక్కో మడిలో నీరు ఒక్కో రంగులో కనిపిస్తుంటుంది. కొన్నాళ్లకు అక్కడ ఇంకో రంగేదో వెలుస్తుంది.
* ఇక్కడ ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ దీనిలోని మైక్రోబ్‌లూ ఎక్కువైపోతుంటాయట. ఒక్కోసారి దీనిలో అల్గేలు పెరిగిపోతుండటంతో వాటి రకాల్ని బట్టి ఇక్కడ రంగులు కనిపించేస్తుంటాయట.
* ఇంకానేమో ఇక్కడి నేలలో డ్యూనాలెయిల్లా అనే రసాయనం ఉందట. దీని కారణంగానూ ఇక్కడి నీరు గులాబీ రంగులోకి మారుతుంటుందని అక్కడి అధికారులు చెబుతున్నారు.
* 120 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉందిది.
* శీతకాలం వచ్చేకొద్దీ ఇందులో నీరు ఇంకిపోయి ఉప్పు మాత్రమే కనిపిస్తుంటుంది. మళ్లీ కాలం మారే సరికి కొత్త నీరు వస్తుంది. కొత్త రంగులు తెస్తుంది.
* నాలుగు వేల ఏళ్లుగా దీని నుంచి చైనావారు ఉప్పును ఉత్పత్తి చేస్తున్నారు.
* ఈ సరస్సు 50 మిలియన్‌ ఏళ్ల క్రితం నుంచీ ఉన్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి.
* అందుకే ఈ ఉప్పు నీటి సరస్సు అక్కడ పర్యటక ప్రాంతమూనూ.

* లోతట్టు ప్రాంతాల్లో ఏర్పడిన ఉప్పు నీటి సరస్సుల్లో ఇది ప్రపంచంలోనే మూడో అతి పెద్దది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని