మూడు నగరాలు ఒక్కటయ్యాయి !

న‌గ‌రం: బుడాపెస్ట్‌దేశం: హ‌ంగేరిజ‌నాభా: 17 లక్షలకు పైమాటేవిస్తీర్ణం: 525 చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్లు* బుడాపెస్ట్‌... హంగేరి రాజధాని. ఈ దేశంలోనే అతి పెద్ద నగరం కూడా.* 40 థియేటర్లు, 100 మ్యూజియాలు ఉన్నాయి.* బుడా, పెస్ట్‌, ఒబుడా అనే మూడు నగరాలు కలిసి బుడాపెస్ట్‌గా మారింది. 1873లో ఈ మూడు నగరాలు ఒకే పెద్ద నగరంగా ఏర్పడ్డాయన్నమాట....

Published : 02 Feb 2019 01:06 IST

మహా నగరం
బుడాపెస్ట్‌

న‌గ‌రం: బుడాపెస్ట్‌
దేశం: హ‌ంగేరి
జ‌నాభా: 17 లక్షలకు పైమాటే
విస్తీర్ణం: 525 చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్లు
* బుడాపెస్ట్‌... హంగేరి రాజధాని. ఈ దేశంలోనే అతి పెద్ద నగరం కూడా.
* 40 థియేటర్లు, 100 మ్యూజియాలు ఉన్నాయి.
* బుడా, పెస్ట్‌, ఒబుడా అనే మూడు నగరాలు కలిసి బుడాపెస్ట్‌గా మారింది. 1873లో ఈ మూడు నగరాలు ఒకే పెద్ద నగరంగా ఏర్పడ్డాయన్నమాట.
* యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించిన ప్రదేశాలు ఇక్కడ ఎక్కువే. వీటిల్లో బుడా క్యాజిల్‌ హిల్‌, చైనా బ్రిడ్జ్‌, హీరోస్‌ స్క్వేర్‌ ప్రఖ్యాత సందర్శక ప్రాంతాలు.
* ఈ దేశ వయోవృద్ధులు ఈ నగరంలోని మెట్రో, బస్సు, ట్రాలీ వంటి ప్రభుత్వ రవాణాలో ఉచితంగానే వెళ్లొచ్చు.
* ఇక్కడ ఏటా ఆగస్టు నెలలో వారం రోజుల పాటు మ్యూజిక్‌ ఫెస్టివల్‌ సందడిగా జరుగుతుంది. ఇందులో లక్షల మంది పాల్గొంటారు.

* రూబిక్స్‌ క్యూబ్‌ తెలుసుగా... మనకిష్టమైన ఆటబొమ్మల్లో ఇదీ ఒకటి.  దీన్ని తయారు చేసిన రూబిక్‌ ఇక్కడి వాడే.

* ఇక్కడ వేడి నీటి బుగ్గలు చాలా ఎక్కువ. అందుకే ‘సిటీ ఆఫ్‌ బాత్స్‌’ అని దీనికి పేరు. సహజ సిద్ధమైన ఈ వేడి నీటి బుగ్గల్లో స్నానాలు చేస్తే వ్యాధులు తగ్గుతాయని నమ్ముతారు. వీటికి మెడికల్‌ బాత్స్‌గా పేరు. ఎక్కడెక్కడి నుంచో పర్యటకులు వస్తుంటారు.

చిన్నారుల చుక్‌చుక్‌!

ఇక్కడ చిల్డ్రన్‌ రైల్వే ఉంది. ఇదేదో ఉత్తుత్తి రైలు కాదు. నిజమైన రైలు లైను. టీసీ దగ్గర్నించి సిగ్నల్స్‌ ఆపరేటర్‌, విచారణ అధికారి వరకూ అందరూ పిల్లలే. రైల్వే అధికారుల విధుల్ని, రైల్వేశాఖ గురించి స్వయంగా విద్యార్థులే తెలుసుకునేందుకు దీన్ని ఏర్పాటు చేశారు. దీనికోసం పిల్లలకు నాలుగు నెలల పాటు శిక్షణ ఇస్తారు.

* బుడాపెస్ట్‌ పార్లమెంట్‌ భవంతి ప్రపంచంలోని మూడో అతిపెద్ద పార్లమెంట్‌ భవనం. ఇందులో 691 గదులు, దాదాపు 20 కిలోమీటర్ల పొడవైన మెట్ల దారి ఉంటాయి. ఈ భవంతి ఏకంగా 315 అడుగుల ఎత్తుంటుంది.

* ఇక్కడి సబ్‌వే లైన్‌ ప్రపంచంలోని పురాతనమైన సబ్‌వే లైన్లలో ఒకటి. 1896లో మొదలైందిది.

* ప్రపంచంలోని పురాతనమైన జంతు ప్రదర్శనశాలల్లో ఇక్కడి జూ ఒకటి. 1865లో ప్రారంభమైన ఈ జూలో వెయ్యి జాతులకు చెందిన పదివేలకుపైగా జంతువులున్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని