మారథాన్‌ పరుగులు ఇక్కడివే!

నగరం: ఏథెన్స్‌ దేశం: గ్రీసు.  ఏథెన్స్‌... గ్రీసు దేశ రాజధాని.  దాదాపు 3,400 సంవత్సరాల పురాతన నగరమిది. ప్రపంచంలోని పురాతనమైన నగరాల్లో ఇదీ ఒకటి. దేశ జనాభాలో 40 శాతం ప్రజలు ఈ నగరంలోనే ఉంటారు. ప్రజాస్వామ్య భావనకు పుట్టినిల్లు ఏథెన్స్‌.  క్రీస్తుపూర్వం 500 సంవత్సరంలోనే ఈ విధానాలు, నిబంధనలు అభివృద్ధి చేశారిక్కడ.  

Published : 16 Feb 2019 01:13 IST

మహా నగరం
ఏథెన్స్‌

నగరం: ఏథెన్స్‌ 
దేశం: గ్రీసు 
* ఏథెన్స్‌... గ్రీసు దేశ రాజధాని. 
* దాదాపు 3,400 సంవత్సరాల పురాతన నగరమిది. ప్రపంచంలోని పురాతనమైన నగరాల్లో ఇదీ ఒకటి.
* దేశ జనాభాలో 40 శాతం ప్రజలు ఈ నగరంలోనే ఉంటారు.
* ప్రజాస్వామ్య భావనకు పుట్టినిల్లు ఏథెన్స్‌. క్రీస్తుపూర్వం 500 సంవత్సరంలోనే ఈ విధానాలు, నిబంధనలు అభివృద్ధి చేశారిక్కడ. 
* ఏథెన్స్‌ గ్రీసు మొదటి రాజధాని కాదు. 19వ శతాబ్దంలో స్వాతంత్య్రం వచ్చాక రాజధాని అయ్యింది.

* గ్రీకు దేవత ఎథీనా పేరు మీదుగా ఈ నగరం ఏర్పడింది. ఈ దేవత ప్రసిద్ధ ఆలయం పార్థినోన్‌.. ఈ నగరంలో ప్రత్యేక ఆకర్షణ.

* గ్రీకుల ఆహారంలో ప్రధానమైంది ఆలివ్‌. పైగా ప్రపంచంలో ఆలివ్‌ ఉత్పత్తి చేయడంలో ఇది మూడో స్థానంలో ఉంది. కొన్ని వేల సంవత్సరాల నుంచే ఏథెన్స్‌లో ఈ ఆలివ్‌ చెట్లు పెంచుతున్నారు. 1200 సంవత్సరాల నాటి కొన్ని చెట్లు ఇప్పటికీ ఆలివ్‌ల్ని ఉత్పత్తి చేస్తున్నాయి.

* ఏటా ఇక్కడికి ఇంచుమించు కోటీ ఎనభైలక్షల మంది సందర్శకులు వస్తుంటారు.

* ప్రపంచాన్ని ప్రభావితం చేసిన పాశ్చాత్య తత్త్వానికి ఆద్యుడైన సోక్రటీస్‌ ఈ నగరానికి చెందినవాడే.

* గ్రీకులు థియేటర్లంటే ఎక్కువగా ఇష్టపడతారు. ఇక్కడ పురాతనమైన థియేటర్లు చాలా ఉన్నాయి.

* ‘మారథాన్‌ రేస్‌’ అనే పదానికి అర్థం లాంగ్‌ రేస్‌. ఈ పదం పుట్టింది ఇక్కడే. క్రీస్తుపూర్వం 490 సంవత్సరంలో గ్రీకు సైనికుడు ఫిలప్పీడీస్‌ ఏథెన్స్‌ విజయవార్తను చేరవేయడానికి మారథాన్‌ నుంచి ఏథెన్స్‌కు ఆగకుండా పరుగెత్తాడు. అలా ఆ పేరొచ్చిందట.

* క్రీస్త్తు పూర్వం 776లో ప్రారంభమైన ఒలింపిక్‌ క్రీడల్ని క్రీస్తు శకం 393లో నిలిపి వేశారు. మళ్లీ ఈ క్రీడలు క్రీస్తు శకం 1896లో ఏథెన్స్‌లో పునః ప్రారంభమయ్యాయి. 

* ప్రముఖ తత్త్వవేత్త, గణిత శాస్త్రవేత్త ప్లేటో కూడా ఇక్కడి వాడే.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని