మేడంత మొక్క!

కొన్ని ఎడారి మొక్కలున్నాయి...వాటికి పండ్లు కాస్తాయి...వాటిని తింటార్ట కూడానూ...పైగా అన్నింటికీ మించినప్రత్యేకత ఇంకోటుంది...ఏంటో.. ఏమో..చదివేస్తే పోలా! ఎడారి మొక్కంటే ముళ్లతో, దళసరి ఆకులతో, చిన్నగా ఉన్న వాటినే మనం చూస్తుంటాం. మరేమో ఓ రకం ఎడారి మొక్క చాలా చిత్రమైనది. వాటి జాతి ప్రపంచంలోనే అతి ఎత్తయిన ..

Published : 09 Oct 2018 10:49 IST

మేడంత మొక్క!కొన్ని ఎడారి మొక్కలున్నాయి...వాటికి పండ్లు కాస్తాయి...వాటిని తింటార్ట కూడానూ...పైగా అన్నింటికీ మించినప్రత్యేకత ఇంకోటుంది...ఏంటో.. ఏమో..చదివేస్తే పోలా! 
ఎడారి మొక్కంటే ముళ్లతో, దళసరి ఆకులతో, చిన్నగా ఉన్న వాటినే మనం చూస్తుంటాం. మరేమో ఓ రకం ఎడారి మొక్క చాలా చిత్రమైనది. వాటి జాతి ప్రపంచంలోనే అతి ఎత్తయిన ఎడారి మొక్కల జాతట. 

* దాని పేరేంటంటే సాగువారోస్‌. పాచెయ్‌సెరుస్‌ ప్రింగ్లి, మెక్సికన్‌ జెయింట్‌ కార్డన్‌, ఎలిఫెంట్‌ కాక్టస్‌, కార్డన్‌.. లాంటి పేర్లూ ఉన్నాయి. 
* అమెరికా, మెక్సికో పరిసర ప్రాంతాలు దీని పుట్టిళ్లు. ఉత్తర, దక్షిణ అమెరికాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా పొడి నేలల్లో అక్కడక్కడా పెరుగుతుంది. 
* ఇది దాదాపుగా నాలుగంతస్తుల భవనం అంత ఎత్తు ఎదుగుతుంది. రెండు వందల నుంచి మూడు వందల ఏళ్లు బతుకుతుంది. 
* వీటిల్లో మనం కొలిచిన అతి పొడవైన మొక్క 63 అడుగుల పొడవుంది. ఆరంతస్తుల భవనంకంటే ఎత్తన్నమాటే. మామూలుగా అయితే ఏమోగానీ కాక్టస్‌ జాతి మొక్క ఇంత పొడుగవ్వడం నిజంగా చిత్రమే. 
* దీనికి ముందు పొడవాటి స్తంభం ఎదిగాక చెట్టులా విస్తరిస్తుంది. చూసేందుకు గమ్మత్తయిన చిక్కని ఎడారి చెట్టులా కనిపిస్తుంది. కొన్నయితే పెద్దగా కొమ్మలు రాకుండానే నిటారుగా పైకెదిగిపోతాయి. 
* అన్ని ఎడారి మొక్కల్లాగే దీనికి పువ్వులు పూస్తాయి. అవి కాయలూ అవుతాయి. పైగా అవి మనం తినడానికీ పనికి వస్తాయిట. మెక్సికోలో ఉండే కొన్ని తెగల ప్రజలు వీటిని తింటుంటారు. వీటిలో పోషక విలువలు సైతం ఎక్కువగా ఉంటాయిట. 
* ఈ చెట్టు వేళ్లు.. ఓ రకమైన బ్యాక్టీరియా, ఫంగస్‌లకు ఆశ్రయం కల్పిస్తాయి. దీంతో ఇది అసలు నేల లేని రాతి మీదా పెరిగేయగలదు. ఎందుకంటే ఇది ఆశ్రయం ఇచ్చే బ్యాక్టీరియాలు గాలిలోంచే నైట్రోజన్‌, ఖనిజాల్ని పీల్చుకుని 
ఇది పెరగడానికి సహకరిస్తాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని