సందర్శకుల స్వర్గం!

నగరం: నీస్‌దేశం: ఫ్రాన్స్‌విస్తీర్ణం: 71.92 చదరపు కిలోమీటర్లుజనాభా: దాదాపు మూడున్నర లక్షలు* దీనికి నీస్‌ లా బెల్లే అనే ముద్దు పేరు కూడా ఉంది. ‘నీస్‌ అందమైనది’ అని దీనర్థం.* ఐరోపాలోని పురాతనమైన నగరాల్లో ఇదీ ఒకటి. క్రీస్తుపూర్వం 350లోనే గ్రీకులు ఇక్కడ ఆవాసాలు ఏర్పర్చుకున్నారు.* ఇక్కడి ప్రకృతి సోయగాల్ని చూడ్డానికి ఎక్కడెక్కడి నుంచో పర్యటకులు వస్తుంటారు. వీరి సంఖ్య ఏటా ఇంచుమించు 40 లక్షలు. అంతేకాదూ... వేల ఏళ్ల క్రితమే ఇక్కడికి పర్యటకుల రాక మొదలయ్యింది...

Published : 16 Mar 2019 00:16 IST

మహా నగరం
నీస్‌

నగరం: నీస్‌
దేశం: ఫ్రాన్స్‌
విస్తీర్ణం: 71.92 చదరపు కిలోమీటర్లు
జనాభా: దాదాపు మూడున్నర లక్షలు
* దీనికి నీస్‌ లా బెల్లే అనే ముద్దు పేరు కూడా ఉంది. ‘నీస్‌ అందమైనది’ అని దీనర్థం.
* ఐరోపాలోని పురాతనమైన నగరాల్లో ఇదీ ఒకటి. క్రీస్తుపూర్వం 350లోనే గ్రీకులు ఇక్కడ ఆవాసాలు ఏర్పర్చుకున్నారు.
* ఇక్కడి ప్రకృతి సోయగాల్ని చూడ్డానికి ఎక్కడెక్కడి నుంచో పర్యటకులు వస్తుంటారు. వీరి సంఖ్య ఏటా ఇంచుమించు 40 లక్షలు. అంతేకాదూ... వేల ఏళ్ల క్రితమే ఇక్కడికి పర్యటకుల రాక మొదలయ్యింది.
* ఈ నగరం ఇటలీకి దగ్గర్లో ఉంటుంది. ఈ నగర చరిత్రలో ఇటలీ పాత్ర చాలానే ఉంటుంది. అందుకే ఇక్కడి జనాభా ఇటాలియన్‌ కూడా మాట్లాడతారు. హోటళ్లు, రెస్టారెంట్లలో ఇటాలియన్‌ రుచులు దొరుకుతుంటాయి. స్కూళ్లలో ఇంగ్లిషుతో పాటు ఇటాలియన్‌ భాష కూడా నేర్చుకుంటారు.
* చాలాకాలం పాటు ఇటలీ భూభాగంలో ఉండేది ఈ నగరం. 1860లో ఫ్రాన్స్‌లో భాగమయ్యింది.
* విజయానికి ప్రతీకగా ఉండే గ్రీకు దేవత నీక్‌ పేరు మీదుగా ఈ నగరానికీ పేరొచ్చింది.
* ఇక్కడి ఫైనిక్స్‌ పార్క్‌ ఫ్లోరా ఐరోపాలోనే అతిపెద్ద గ్రీన్‌ హౌస్‌. దీంట్లో 2,500 రకాల జాతుల మొక్కలు ఉన్నాయి.
* ప్రసిద్ధ చిత్రకారుడు పికాసో, ప్రముఖ రచయిత ఫిట్జిరాల్డ్‌ ఈ నగరంలో నివసించినవారే.
* నీస్‌...  మధ్యధరా సముద్ర తీరంలో ఉండే అందమైన నగరం. జనాభా పరంగా ఫ్రాన్స్‌లో అయిదో అతి పెద్ద నగరం.
* ఫ్రాన్స్‌లో ఎక్కువ మ్యూజియాలున్న నగరాల్లో ఇదీ ఒకటి.

* ఏటా ఫిబ్రవరి నెల మధ్యలో రెండు వారాల పాటు భారీ ఎత్తున కార్నివాల్‌ జరుగుతుంది. వేలాది మంది సంగీతకళాకారులు, డ్యాన్సర్లు వస్తుంటారు. దేశదేశాల నుంచి లక్షల మంది సందర్శకులు వస్తుంటారు. ఈ వేడుకను 1294వ సంవత్సరం నుంచి ఘనంగా నిర్వహిస్తున్నారు.

* ఈ నగరంలోని సముద్ర తీరాలు నున్నని రాళ్లతో భలే అందంగా ఉంటాయి. వీటిని రాక్‌ఫిల్ల్‌డ్‌ బీచ్‌లు అంటారు. 

* ఫ్రాన్స్‌ మొత్తంలో ట్రాఫిక్‌లైట్లు ఈ నగరంలోనే ఎక్కువ. 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని