ఓహో.. గులాబీల నగరమా!

నగరం: బ్లూంఫౌంటేన్‌ దేశం: దక్షిణ ఆఫ్రికా విస్తీర్ణం: 236 చదరపు కిలోమీటర్లు జనాభా: దాదాపు రెండున్నర లక్షలు * బ్లూంఫౌంటేన్‌... దక్షిణ ఆఫ్రికా జ్యుడిషియల్‌ రాజధాని. ఈ దేశానికున్న మూడు రాజధాని నగరాల్లో ఇదీ ఒకటి. * ఈ నగర ప్రజలు ఎక్కువగా ఆంగ్లం, ఆఫ్రికాన్స్‌ భాషలు మాట్లాడుతుంటారు. * దేశంలో ఆరో అతిపెద్ద నగరం.* ఈ నగరానికి మంగ్వాంగ్‌, చిరుతల ప్రాంతం అని రకరకాల పేర్లున్నాయి....

Published : 30 Mar 2019 00:20 IST

మహా నగరం
బ్లూంఫౌంటేన్‌

నగరం: బ్లూంఫౌంటేన్‌
దేశం: దక్షిణ ఆఫ్రికా
విస్తీర్ణం: 236 చదరపు కిలోమీటర్లు
జనాభా: దాదాపు రెండున్నర లక్షలు

* బ్లూంఫౌంటేన్‌... దక్షిణ ఆఫ్రికా జ్యుడిషియల్‌ రాజధాని. ఈ దేశానికున్న మూడు రాజధాని నగరాల్లో ఇదీ ఒకటి.

* ఈ నగర ప్రజలు ఎక్కువగా ఆంగ్లం, ఆఫ్రికాన్స్‌ భాషలు మాట్లాడుతుంటారు.

* దేశంలో ఆరో అతిపెద్ద నగరం.

* ఈ నగరానికి మంగ్వాంగ్‌, చిరుతల ప్రాంతం అని రకరకాల పేర్లున్నాయి.

* ఈ నగరాన్ని 1846లో ఏర్పాటు చేశారు. 1910 నుంచి ఇది దేశ రాజధానుల్లో ఒకటిగా మారింది.

* ఫుడ్‌, ఫర్నిచర్‌, గ్లాస్‌ పరిశ్రమలు ఎక్కువ. వ్యవసాయం, మైనింగ్‌కి ప్రధాన కేంద్రం ఈ నగరం.

* ఇక్కడి ఆర్కిడ్‌ హౌస్‌ భలేగా ఉంటుంది. వేలాది రకాల ఆర్కిడ్‌ పూల మొక్కలుంటాయి.

* ఇక్కడి నేషనల్‌ ఉమెన్స్‌ మెమోరియల్‌ ప్రత్యేక ఆకర్షణ. రెండో బూర్‌ యుద్ధంలో మరణించిన 27 వేల మందికి గుర్తుగా దీన్ని 1913లో ఏర్పాటు చేశారు. మహిళలు, చిన్నారులకు అంకితమిస్తూ నిర్మించారు. మహిళల మొదటి స్మారకస్థూపం ఇది.

* ఇక్కడి అగ్నిమాపక ప్రదర్శనశాల మంచి పర్యటక ప్రాంతం. పాత తరం నాటి ఫైర్‌ ఇంజిన్లు, పరికరాలు, ఫొటోలు ఉంటాయిక్కడ.

* ఈ నగరానికి దగ్గర్లో ‘చీతా ఎక్స్‌పీరియన్స్‌ కన్జర్వేషన్‌ సెంటర్‌’ ఉంటుంది. ఇందులో పులులు, సింహాలు, చిరుతలూ ఉంటాయి. ఎంచక్కా వాటిని దగ్గర్నించి చూడొచ్చు. ఫొటోలూ దిగొచ్చు.

* బ్లూంఫౌంటేన్‌ అనే పేరుకు డచ్‌లో ఫౌంటేన్‌ ఆఫ్‌ ఫ్లవర్స్‌ అని అర్థం. సరదాగా ‘ద సిటీ ఆఫ్‌ రోజెస్‌’ అని పిలుస్తుంటారు. ఇక్కడ గులాబీ తోటలు చాలా ఎక్కువ. ఏటా రోజ్‌ ఫెస్టివల్‌ భారీ ఎత్తున జరుగుతుంది. 1976 నుంచి నిర్వహిస్తున్న ఈ వేడుకలో వేలాది గులాబీ పూల ప్రదర్శనతో పాటు రకరకాల పోటీలు పెడుతుంటారు. ఫ్లవర్‌ వాక్‌లూ ఉంటాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు