బంతిలా మారేదొకటి.. బాణమేసేదొకటి!

వింత చేపలున్నాయి... కొన్ని చూడ్డానికి విచిత్రంగా ఉంటాయి... ఇంకొన్ని చేతల్లో చిత్రం అనిపిస్తాయి... ఇవే అవి! రెక్కల మధ్యలో ఒదిగి పోయినట్లు కనిపిస్తున్న దీని పేరు పెటరోయిస్‌. ఆకారాన్ని బట్టే దీన్ని లయన్‌ ఫిష్‌ అనీ అంటుంటారు. అట్లాంటిక్‌, కరేబియన్‌, మధ్యదరా సముద్రాల్లో కనిపిస్తుంటుందిది.

Published : 08 May 2019 00:44 IST

 

వింత చేపలున్నాయి... కొన్ని చూడ్డానికి విచిత్రంగా ఉంటాయి... ఇంకొన్ని చేతల్లో చిత్రం అనిపిస్తాయి... ఇవే అవి!

రెక్కల మాయ

రెక్కల మధ్యలో ఒదిగి పోయినట్లు కనిపిస్తున్న దీని పేరు పెటరోయిస్‌. ఆకారాన్ని బట్టే దీన్ని లయన్‌ ఫిష్‌ అనీ అంటుంటారు. అట్లాంటిక్‌, కరేబియన్‌, మధ్యదరా సముద్రాల్లో కనిపిస్తుంటుందిది.

ఉబ్బిపోతుంది

చిన్నగానే ఉన్న దీని పేరు పఫర్‌ ఫిష్‌. మామూలుగా ఇది చిన్న శరీరంతోనే ఉంటుంది కానీ శత్రువుల్ని భయపెట్టాలనుకున్నప్పుడు మాత్రం ఇలా ఉబ్బిపోతుంది.

నేలలో గూడు

దీని పేరు లంగ్‌ ఫిష్‌. ఇది మామూలుగా నీటిలోనే ఉంటుంది. నీళ్లు ఇంకిపోతున్నాయనుకున్నప్పుడు భూమిలోపలికి తొలుచుకు వెళ్లి ఇలా గూళ్లు పెట్టేస్తుంది. నాలుగైదేళ్ల పాటు తిండీ తిప్పల్లేకుండా ఇలాగే బతికేయగలదు.

రంగులు మార్చేస్తుంది

రెక్కల్నే కాళ్లలా ఉపయోగించే దీని పేరు ఫ్రాగ్‌ ఫిష్‌. చుట్టూ వాతావరణంలా దాని రంగును మార్చేయగలదు. దాని మీద అల్గే, నాచు.. లాంటి వాటికి ఆశ్రయమిచ్చి పరిసరాల్లో కలిసిపోగలదు.

డబ్బా ఆకారం

దీని పేరు బాక్స్‌ ఫిష్‌. పసిఫిక్‌, హిందూ మహా సముద్రాల్లో ఈ చిత్రమైన చేప కనిపిస్తుంటుంది. డబ్బాలాంటి శరీర ఆకారమే దీని గొప్ప.

భలే నోరు

చిలుక ముక్కును పోలిన నోటితో ఉన్న ఈ చేప పేరు పేరెట్‌ ఫిష్‌. ఉష్ణమండల, ఉప ఉష్ణమండల ప్రాంతాల్లోని సముద్రాల్లో ఇదెక్కువ కనిపిస్తుంటుంది.

విలుకాడు

ఉమ్మి శత్రువుల్ని చంపేసే ఈ చేప పేరు ఆర్చర్‌. బుల్లెట్‌ వేగంతో నీటిని బాణంలా శత్రువుపై ఉమ్మి వాటిని చంపి తినడం దీని ప్రత్యేకత.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని