చెప్పుకోండి చూద్దాం

ఒక దగ్గర ఇద్దరు తల్లులు, ఇద్దరు కూతుళ్లు, ఒక అమ్మమ్మ, ఒక మనవరాలు ఉన్నారు. అక్కడ ఎంత మంది ఉన్నట్లు?

Published : 02 Jul 2020 00:36 IST

ఒక దగ్గర ఇద్దరు తల్లులు, ఇద్దరు కూతుళ్లు, ఒక అమ్మమ్మ, ఒక మనవరాలు ఉన్నారు. అక్కడ ఎంత మంది ఉన్నట్లు?


ఒకే వాక్యంలో రెండు జీవులు!

కింది వాక్యాల్లో ఒక్కోదాంట్లో రెండు జీవులు దాగున్నాయ్‌. మరి పట్టుకుంటారా?

1. ఈ ఉల్లిపకోడి తింటుంటే ఆవులింతలు వచ్చేస్తున్నాయి.

2. ఈరోజింక రామే కమలను తీసుకువస్తాడు.

3. నీతూ! నీగదిలోనే అలా ఏకాకిలా కూర్చోకుండా బయటికి రావొచ్చుగా!

4. ఈ గదిలోనే నా వాచీ మర్చిపోయా.

5. నీదో మతి మరుపు లోకమనే మీ మేనత్త తిడుతుంది మరి!


చిలిపి ప్రశ్నలు

1. నిండు నూరేళ్లు ఎవరు బతుకుతారు?

2. ఒక కోడి రోడ్డు దాటుతోంది... ఎందుకు?

3. ఫ్యాన్‌ను స్విచ్‌ ఏమని బెదిరిస్తుంది?


అరె నిజమే కదా!

కేవలం ఇటుకలతోనే బిల్డింగ్‌ను పూర్తి చేయాలంటే ఎన్ని ఇటుకలు అవసరం?


ఆరు తేడాలు కనుక్కోండి


గబగబా అనండి

Three free throws

Cooks cook cupcakes quickly


దారేది?

కొంగకు తన స్నేహితుల దగ్గరకు వెళ్లే దారి చూపిస్తారా?


జవాబులు:

చెప్పుకోండి చూద్దాం: ముగ్గురు (అమ్మమ్మ, ఆమె కూతురు, ఆమె మనవరాలు)

ఒకే వాక్యంలో రెండు జీవులు: 1. కోడి, ఆవు 2. జింక, మేక 3. తూనీగ, కాకి 4. ఈగ, చీమ 5. దోమ, నత్త

చిలిపి ప్రశ్నలు: 1.ఆయుష్షు ఉన్నవారు 2. రోడ్డు ఉంది కాబట్టి 3. గుండ్రంగా తిప్పేస్తా జాగ్రత్త అని..

అరె నిజమే కదా: కేవలం ఒకే ఒక్క ఇటుక (చిట్టచివరి ఇటుకతోనే కదా బిల్డింగ్‌ పూర్తయ్యేది)

ఆరు తేడాలు కనుక్కోండి: ఎలుగు చెవి, గాలం, చేప, పొద, వానపాము, చెట్టు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని