పొడుపు కథలు

పచ్చని మిస మిస నా దేహంగొప్పదైన బంగారు లోహంచేతి వేలే నా చిరవాసంనేనుంటే

Updated : 03 Aug 2020 00:17 IST

1. పచ్చని మిస మిస నా దేహంగొప్పదైన బంగారు లోహంచేతి వేలే నా చిరవాసంనేనుంటే మీకు సంతోషం.

2. చినచిన్నాకులు, చిత్తరాకులు కసురాకులు, కానుగాకులు ఎన్నికోసినా కట్టకుగావు.


తమాషా ప్రశ్నలు

1. నాకు జీవితం లేదు. కానీ చనిపోతాను. నేనెవర్ని?

2. మీరు మాట్లాడటం మొదలు పెట్టగానే ఇది పోతుంది. ఏంటదీ?

3. శుభ్రంగా ఉంటే నల్లగా ఉంటుంది. మురికిగా ఉన్నప్పుడు తెల్లగా ఉంటుంది.


ఒకరోజు రమ్య ఏడుస్తుంటే శ్యామ్‌ దగ్గరికి వచ్ఛి.

శ్యామ్‌ : ఎందుకు ఏడుస్తున్నావ్‌

రమ్య : నా మార్కులు తక్కువ వచ్చాయి అందుకే..

శ్యామ్‌ : అవునా ఎన్ని మార్కులొచ్చాయి?

రమ్య : ఎనభై మార్కులు.

శ్యామ్‌ : అవునా.. దానికెందుకు ఏడవడం! ఈ మార్కులతో ఇద్దరు పాస్‌ అవ్వొచ్చు తెలుసా!! (అంటూ విసుక్కుని వెళ్లిపోయాడు.)


1. మధ్యప్రదేశ్‌లోని ఏ ప్రదేశం ఫెస్టివల్‌ ఆఫ్‌ డాన్స్‌కు ప్రసిద్ధి?

2. మన దేశంలో విడుదలయిన మొదటి కలర్‌ సినిమా?

3. అజంతా, ఎల్లోరా గుహలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి?

4. హిరోషిమా దినోత్సవం ఎప్పుడు?




సుడోకు

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3X3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండు సార్లు రాకూడదు.


జవాబులు:

పొడుపు కథలు

1. బంగారు ఉంగరం 2. కనురెప్పలు

తమాషాప్రశ్నలు

1. బ్యాటరీ 2. నిశ్శబ్దం 3. బ్లాక్‌బోర్డు

క్విజ్‌ క్విజ్‌

1. ఖజురహో 2. కిసాన్‌ కన్యా 3. మహరాష్ట్ర 4. ఆగస్టు 6న


సుడోకు



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని