కాగితం కప్పుతో గాలిమర!

హాయ్‌ పిల్లలూ..! మనం హోటల్‌కి వెళ్లినప్పుడో, ఏదైనా ఫంక్షన్లకు హాజరైనప్పుడో పేపర్‌ కప్పుల్లో నీళ్లు, టీ ఇస్తుంటారు కదా. అలాంటి కప్పులతో ముచ్చటగా ఉండే రకరకాల బొమ్మలు చేసుకోవచ్చు తెలుసా? ఇప్పుడు మాత్రం మనం గాలిమర(విండ్‌మిల్‌) ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం.

Published : 06 Sep 2020 02:04 IST

హాయ్‌ పిల్లలూ..! మనం హోటల్‌కి వెళ్లినప్పుడో, ఏదైనా ఫంక్షన్లకు హాజరైనప్పుడో పేపర్‌ కప్పుల్లో నీళ్లు, టీ ఇస్తుంటారు కదా. అలాంటి కప్పులతో ముచ్చటగా ఉండే రకరకాల బొమ్మలు చేసుకోవచ్చు తెలుసా? ఇప్పుడు మాత్రం మనం గాలిమర(విండ్‌మిల్‌) ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ఇంతకీ గాలిమర అంటే ఏంటో చెప్పలేదు కదూ.. గాలి నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేసే పరికరం అన్నమాట. ఎత్తైన ప్రదేశాల్లో వీటిని అమరుస్తుంటారు.

*● కావాల్సిన వస్తువులు

1. పేపర్‌ కప్‌-1

2. మార్కర్‌ (నలుపు)

3. రంగుల అట్ట (కప్పు రంగు కాకుండా మరోటి ఎంపిక చేసుకోవాలి)

*● ఎలా చేయాలంటే..

ముందుగా పేపర్‌ గ్లాస్‌ తీసుకొని తలకిందులుగా చేయాలి. బోర్లించిన ఆ కప్పు కింది భాగంలో కిటికీలు, ద్వారం అనిపించేలా గీతలు గీయాలి. తర్వాత పంకా(ఫ్యాన్‌) రెక్కల మాదిరి ముందే కత్తిరించిన అట్టముక్కలను ‘x’ ఆకారంలో కప్పు పైభాగంలో అంటించాలి. అంతే.. చూడచక్కని గాలిమర తయారైనట్టే. ఇలా ఎన్ని కావాలంటే అన్ని తయారు చేసుకొని అలంకరణ సామగ్రిలా వాడుకోవచ్ఛు ఇంకేం.. మీరు నేర్చుకున్నది స్నేహితులకు, బంధువులకు చూపించండి.


రంగులు వేద్దామా!



మెదడుకు మేత

అది పది అంకెల సంఖ్య. తొలి అంకె ఆ సంఖ్యలోని మొత్తం సున్నాలను, రెండో అంకె ఒకట్లను సూచిస్తుంది. అలా పదవది సంఖ్యలో ఎన్ని తొమ్మిది అంకెలు ఉన్నాయో చెబుతుంది. ఇంతకీ ఆ సంఖ్య ఏదో చెప్పగలరా?


తమాషా ప్రశ్నలు

1. కాళ్లు లేని గుర్రం?

2. తాగలేని ద్రవం?

3. చేతిలోకి తీసుకోలేని కప్పు?


లెక్క తేల్చండి

ఇక్కడి ఆధారాల సాయంతో ప్రశ్నార్థకం స్థానంలో ఏ సంఖ్య ఉండాలో కనుక్కోండి.


జవాబులు: మెదడుకు మేత: 6210001000, లెక్క తేల్చండి: 30 (50+30+10 = 90, 40+20+30 = 90) తమాషా ప్రశ్నలు: 1.సీహార్స్‌ 2.ఉపద్రవం 3.ఇంటి పైకప్పు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని