దాగి ఉన్నవి ఏంటి?

ఇక్కడ కొన్ని దేశాల పేర్లు దాగి ఉన్నాయి. ఈ ఆధారాల సాయంతో అవేంటో చెప్పగలరా?

Published : 02 Feb 2021 00:36 IST

ఇక్కడ కొన్ని దేశాల పేర్లు దాగి ఉన్నాయి. ఈ ఆధారాల సాయంతో అవేంటో చెప్పగలరా?


అక్షరాలతో ఆట

ఇక్కడ కొన్ని ఆంగ్ల పదాలు ఉన్నాయి. అవే అక్షరాలను ఉపయోగించి మరో అర్థవంతమైన పదం రాయండి చూద్దాం..
1) life

2) tale

3) lame

4) part


నవ్వుల్‌.. నవ్వుల్‌

రాకేశ్‌ : ఆకాశ్‌..! ఏంటి మీ తాతయ్యను ఎండలో కూర్చోబెట్టావు?
ఆకాశ్‌ : ‘ఎండలో తిరిగితే నల్లబడతాం’ అని నిన్న మనకు టీచర్‌ చెప్పారు కదా..
రాకేశ్‌ : ఆ.. అయితే..!
ఆకాశ్‌ : మా తాతయ్య తెల్ల జుట్టు కూడా నల్లగా మారుతుందని ఎండలో కూర్చోబెట్టా..
రాకేశ్‌ : ఆఁ..!!


కనుక్కోండి చూద్దాం!

ఇక్కడున్న ఆధారాల సాయంతో ఖాళీలో ఏమి వస్తుందో కనుక్కోండి చూద్దాం.
1. పండు:   ఫ-
2. పాము:   ఫ-  
3. వృశ్చికం:   తే-
4. గ్రామసింహం: కు-
5. వాస్తవం:   ని-


క్విజ్‌.. క్విజ్‌..

1. ఏ రక్త కణాలను రక్షక భటులు అని అంటారు?
2. ఎలుక జీవిత కాలం ఎంత?
3. బీసీజీ టీకాను ఏ వ్యాధిని నిరోధించడానికి వేస్తారు?
4. అంతర్జాతీయ రక్తదాన దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకొంటారు?
5. ‘పోలియో’కు ఉన్న మరో పేరేమిటి?


ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి



సుడోకు

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3శ్రీ3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.


నేను గీసిన బొమ్మ!

-ఎం.అనిరుధ్‌, ఒకటో తరగతి


జవాబులు

కనుక్కోండి చూద్దాం: 1.ఫలం 2.ఫణి 3.తేలు 4.కుక్క 5.నిజం
క్విజ్‌.. క్విజ్‌..: 1.తెల్ల రక్తకణాలు 2.రెండు నుంచి మూడు సంవత్సరాలు 3.క్షయ 4.జూన్‌ 14 5.శిశు పక్షవాతం
అక్షరాలతో ఆట :
1.life 2 late 3. male 4. trap

దాగి ఉన్నవి ఏంటి: 1.జపాన్‌ 2.జర్మనీ 3.క్యూబా ఏది భిన్నం: 1


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని