నవ్వుల్‌.. నవ్వుల్‌..!

బంటి: నిన్న నేను పెద్ద హీరోతో ఫోన్లో మాట్లాడాను తెలుసా?

Updated : 08 Sep 2021 04:47 IST

మాట్లాడారుగా మొత్తానికి...

బంటి: నిన్న నేను పెద్ద హీరోతో ఫోన్లో మాట్లాడాను తెలుసా?

చిన్నూ: అవునా! ఏమన్నారా హీరో?

బంటి: ముందు హలో అన్నారు. తర్వాత రాంగ్‌నంబర్‌ అని పెట్టేశారు!

చిన్నూ: ఆఁ!!

దొందూ దొందే!

పింకి: కొన్ని చేపలు ఉప్పు నీళ్లలోనూ బతికేస్తాయి ఎలా?

చిన్నూ: ఆ.. ఏముంది. ఆ చేపలకు అవి ఉప్పునీళ్లు అని తెలిసిఉండవు.

పింకి: కాదు.. వాటికి ఉప్పు నీళ్లంటే ఇష్టం.

నేను అందుకే నవ్వలేదు!

లిల్లి: అమ్మా! ఇవాళ స్కూల్లో ఓ చిన్నపాప పడిపోతే అందరూ నవ్వారు.

అమ్మ అయ్యో.. అలా నవ్వకూడదమ్మా.. తప్పు.

లిల్లి: నేను అసలు నవ్వలేదమ్మా!

అమ్మ అవునా?! నువ్వు చాలా మంచిదానివి తల్లీ.. ఇంతకీ నువ్వెందుకు నవ్వలేదో చెప్పు.

లిల్లి: ఆ పడిపోయింది నేనే అమ్మ. అందుకని..!

అమ్మ: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని