నవ్వుల్‌... నవ్వుల్‌..!

టీచర్‌: కిట్టూ.. హిమాలయాలు ఎక్కడున్నాయి?

Published : 13 Sep 2021 00:32 IST

నేను తీయలేదు మరి!

టీచర్‌: కిట్టూ.. హిమాలయాలు ఎక్కడున్నాయి?

కిట్టు:  ప్రామిస్‌ టీచర్‌.. నాకేం తెలియదు. వాటిని నేను తీయలేదు. నా దగ్గరైతే లేవు. కావాలంటే నా బ్యాగ్‌ చూసుకోండి టీచర్‌.

టీచర్‌: ఆ!!

ఎంత గొప్ప తాతో!

చిన్ను: ఒరేయ్‌! మా తాతయ్య చనిపోతూ మా కోసం రెండు కోట్ల రూపాయలు వదిలేసి పోయాడు తెలుసా?

మిన్ను: మా తాత కూడా పోతూ పోతూ మా కోసం మూడు కోట్ల రూపాయలు వదిలేశాడు తెలుసా!

చంటి: ఆపండహే..! అవేం గొప్ప. మా తాతగారైతే ఈ ప్రపంచాన్నే వదిలేసి వెళ్లిపోయాడు తెలుసా?


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని