నవ్వుల్‌.. నవ్వుల్‌..!

టీచర్‌: పిల్లలూ! మనం రైలులో వెళుతున్నప్పుడు కిటికీలోంచి చూస్తే చెట్లు, గుట్టలు వెనక్కి పరిగెడుతున్నట్లుగా ఉంటాయి.. ఎందుకో తెలుసా?

Updated : 22 Sep 2021 04:21 IST

నిజమే అంటారా!

టీచర్‌: పిల్లలూ! మనం రైలులో వెళుతున్నప్పుడు కిటికీలోంచి చూస్తే చెట్లు, గుట్టలు వెనక్కి పరిగెడుతున్నట్లుగా ఉంటాయి.. ఎందుకో తెలుసా?

పింకి: సాయంత్రమవుతుంది కదా టీచర్‌. బహుశా తమ ఇళ్లకు వెళుతూ ఉంటాయేమో!

టీచర్‌:  ఆఁ!!

అంతేగా.. అంతేగా..!

టీచర్‌: చింటూ.. నీకు వాక్‌ స్వాతంత్య్రం అంటే ఏంటో తెలుసా?

చింటు: ఓ.. తెలుసు టీచర్‌..

టీచర్‌:  గుడ్‌.. అయితే చెప్పు.

చింటు: పౌరులకు నడిచే స్వేచ్ఛ ఉండడాన్నే వాక్‌ స్వాతంత్య్రం అంటారు టీచర్‌.

టీచర్‌:  ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని