నవ్వుల్‌.. నవ్వుల్‌..!

టీచర్‌: శనివారం స్కూలుకు రాలేదేం చింటూ..!

Updated : 26 Sep 2021 01:57 IST

మీరే కదా చెప్పారు!

టీచర్‌: శనివారం స్కూలుకు రాలేదేం చింటూ..!
చింటు: ఆ రోజంతా ఆటలు ఆడుకున్నా టీచర్‌.
టీచర్‌:  స్కూలు ఎగ్గొట్టి ఆటలు ఏంటి? ఆదివారం ఆడుకోవచ్చు కదా!
చింటు: మీరే కదా రేపు చేయాల్సిన పని ఈ రోజే చేయాలని చెప్పారు.
టీచర్‌:  ఆఁ!!


మన చేతుల్లో ఏముంది

బిట్టు: పరీక్షల్లో ఫెయిలయ్యావు కదా.. మీ ఇంట్లో వాళ్లు అడిగితే ఏం చెబుతావు.
కిట్టు: జయాపజయాలు దైవాధీనాలు అని చెబుతా బిట్టూ!
బిట్టు: ఆఁ!!

- రామి జిన్ని. టీనా


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని