నవ్వుల్‌.. నవ్వుల్‌..!

టీచర్‌: ఎగ్జామ్స్‌లో స్లిప్‌లు పెట్టకూడదని తెలియదా? అడిగేది నిన్నే చింటూ.. ఎందుకిలా చేశావో చెప్పు?

Updated : 07 Oct 2021 01:18 IST

ఎందుకిలా చేశావ్‌?

టీచర్‌: ఎగ్జామ్స్‌లో స్లిప్‌లు పెట్టకూడదని తెలియదా? అడిగేది నిన్నే చింటూ.. ఎందుకిలా చేశావో చెప్పు?
చింటు: ఇది స్లిప్‌టెస్ట్‌ అని మీరే అన్నారుగా టీచర్‌ అందుకని..!


తర్వాతి తరాల కోసం

తండ్రి: టింకూ..! ఆ ట్యాప్‌ ఆపేయ్‌. నీళ్లు వృథాగా పోతున్నాయి. తర్వాత తరాలకేమీ మిగలవు.
టింకు: సరే నాన్నా.
తండ్రి: ఇంట్లో లైట్లు, ఫ్యాన్లు అన్నీ ఎందుకు వృథాగా ఆన్‌ చేశారు. ముందు తరాల కోసం మనం విద్యుత్తును ఆదా చేయాలి.
టింకు: సరే నాన్నా.. అన్నీ ఆపేశాను.
తండ్రి: అదేంటి... చదువుకోకుండా పడుకున్నావ్‌?
టింకు: నాకు అంత స్వార్థం లేదు నాన్నా. తర్వాతి తరాల కోసం చదువు ఆదా చేస్తున్నా అంతే.
తండ్రి: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని