నవ్వుల్‌.. నవ్వుల్‌.. !

చింటు: అమ్మా...! మందుల దుకాణానికి వెళ్లి తలనొప్పి మాత్రలు తెమ్మంటావా?!

Published : 08 Oct 2021 00:23 IST

అమ్మా నీకోసమే!

చింటు: అమ్మా...! మందుల దుకాణానికి వెళ్లి తలనొప్పి మాత్రలు తెమ్మంటావా?!

అమ్మ: వద్దు కానీ.. ఇప్పుడు అవెందుకు గుర్తుకొచ్చాయ్‌ చింటూ నీకు.

చింటు: ఏం లేదు మమ్మీ.. స్కూలుకు దసరా సెలవులు ఇచ్చారు. నేను ఇంట్లోనే ఉంటా కదా.. అందుకని

అమ్మ: ఆఁ!!

అయ్యో.. అయ్యో.. అయ్యయ్యో!

టింకు: మేం ఎంతో ఇష్టంగా పెంచుకునే కుక్కపిల్ల చచ్చిపోయింది. మా అమ్మ దాన్ని జీర్ణించుకోలేకపోతోంది బంటీ!

బంటి: అయ్యో.. కుక్కను తినమని ఆంటీకి చెప్పింది ఎవరు?

టింకు: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని