నవ్వుల్‌.. నవ్వుల్‌..

నిన్న క్లాసులో చింటూ నిద్రపోయాడు టీచర్‌

Updated : 09 Oct 2021 00:46 IST

అదీ సంగతి

బంటి: నిన్న క్లాసులో చింటూ నిద్రపోయాడు టీచర్‌

టీచర్‌: మరి నిన్ననే ఎందుకు చెప్పలేదు?

బంటి: అప్పుడు మీరు కూడా నిద్రపోతున్నారు టీచర్‌. అందుకే చెప్పలేదు.

అతి శుభ్రం..!

అత్తయ్య: పింకీ.. ఇదిగో ఈ హల్వా తిని ఎలా ఉందో చెప్పు!

పింకీ: నీకు శుభ్రం ఎక్కువ కదా అత్తయ్య!

అత్తయ్య: నీకెలా తెలుసు..?

పింకీ: ఏం లేదు.. హల్వా వాసన కంటే విమ్‌ సబ్బు వాసనే ఎక్కువ ఘుమఘుమ లాడుతుంటేనూ!

అత్తయ్య: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని