నవ్వుల్‌.. నవ్వుల్‌..!

నాన్న: అరేయ్‌ చిన్నూ.. నా జేబులో నువ్వు డబ్బులు తీస్తున్నప్పుడు అది తప్పని నీ అంతరాత్మ చెప్పలేదా?

Updated : 28 Oct 2021 02:47 IST

అంతేగా.. అంతేగా..!

నాన్న: అరేయ్‌ చిన్నూ.. నా జేబులో నువ్వు డబ్బులు తీస్తున్నప్పుడు అది తప్పని నీ అంతరాత్మ చెప్పలేదా?
చిన్ను: చెప్పింది నాన్న. కానీ చెప్పుడు మాటలు వినొద్దని నువ్వే చెప్పావు కదా. అందుకే వినలేదు.
నాన్న: ఆఁ!!
ఏం చెప్పావురా..!
టీచర్‌: చింటూ.. ఒక వ్యక్తి ఎనభై రూపాయల యాభై పైసలకు ఒక గొడుగు కొని, దాన్ని డెబ్భై అయిదు రూపాయల, డెబ్భై అయిదు పైసలకు అమ్మాడు. దీనివల్ల అతనికి లాభమా? నష్టమా!
చింటు: రూపాయల్లో నష్టం, పైసల్లో లాభం టీచర్‌
టీచర్‌: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని