నవ్వుల్‌.. నవ్వుల్‌..!

బొత్తిగా భయం లేదు టింకు: కరోనా అంటే బొత్తిగా భయం లేకుండా పోతోంది. అమ్మ: ఏ.. ఎందుకలా అంటున్నావు టింకూ!

Updated : 10 Dec 2021 06:41 IST

బొత్తిగా భయం లేదు
టింకు: కరోనా అంటే బొత్తిగా భయం లేకుండా పోతోంది.
అమ్మ: ఏ.. ఎందుకలా అంటున్నావు టింకూ!
టింకు: ఒమిక్రాన్‌ మనదేశంలోకి వచ్చేసినా ఇంకా మా స్కూళ్లకు సెలవులు ప్రకటించడం లేదు మరి.
అమ్మ: ఆఁ!!  

అలా వినీ.. వినీ.. ఇలా చేస్తున్నా!
టీచర్‌: బంటీ.. క్లాసులోకి స్మార్ట్‌ఫోన్‌ ఎందుకు తెచ్చావ్‌?
బంటి: మీరు పాఠం చెబుతున్నప్పుడు వీడియో తీసి.. ఇంటికెళ్లాక చూస్తున్నా టీచర్‌.
టీచర్‌: క్లాసులో పాఠం వినకుండా ఎందుకిలా..?
బంటి: ఆన్‌లైన్‌ క్లాసులు వినీ వినీ.. నాకు అలా అలవాటైపోయింది. క్లాసులో నేరుగా వింటే పాఠం బుర్రకు ఎక్కడం లేదు టీచర్‌.
టీచర్‌: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని