నవ్వుల్‌.. నవ్వుల్‌..!

నాన్న: ఏంటి చింటూ..! ఏదో సీరియస్‌గా ఆలోచిస్తున్నావ్‌? చింటు: ఏం లేదు నాన్నా... ఈ కరోనాకు పరీక్షలంటే ఇష్టం ఉండదు అనుకుంటా..!

Published : 23 Dec 2021 00:32 IST

అయ్య బాబోయ్‌!

నాన్న: ఏంటి చింటూ..! ఏదో సీరియస్‌గా ఆలోచిస్తున్నావ్‌?
చింటు: ఏం లేదు నాన్నా... ఈ కరోనాకు పరీక్షలంటే ఇష్టం ఉండదు అనుకుంటా..!
నాన్న: ఏ.. ఎందుకలా?

చింటు:
ప్రతి సంవత్సరమూ కచ్చితంగా పరీక్షల సమయానికే కరోనా కేసులు పెరుగుతుంటేను!
నాన్న: ఆఁ!!


చదువు మీద ఎంత శ్రద్ధో!
నాన్న: టింకూ.. ఫ్రెండ్స్‌తో సినిమాకు వెళ్తా అన్నావు.
టింకు: అవును నాన్నా.. ఇదిగో వెళ్తున్నా!
నాన్న: మరి... ఆ చేతిలో పుస్తకాలేంటి?

టింకు: పాటలు, ఫైట్లు వచ్చినప్పుడు, ఇంటర్వెల్‌లో చదువుకుందామని నాన్నా!
నాన్న: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని