నవ్వుల్‌.. నవ్వుల్‌..!

టింకు: నాన్నా నాన్నా.. నాకో జీవిత సత్యం తెలిసింది.

Published : 06 Jan 2022 00:57 IST

నిజమే సుమా!

టింకు: నాన్నా నాన్నా.. నాకో జీవిత సత్యం తెలిసింది.

నాన్న: ఓ గుడ్‌.. ఇంత చిన్న వయసులోనే భలేగా మాట్లాడుతున్నావే. ఇంతకీ నీకు తెలిసిన జీవిత సత్యమేంటో చెప్పు.

టింకు: ఏం లేదు నాన్నా.. వెలుతురులోనైనా చీకటిలోనైనా కళ్లు మూసుకుంటే చీకటే కనిపిస్తుంది.

నాన్న: ఆఁ!!

అయ్య బాబోయ్‌!

అమ్మ: మన పక్కింటి ఆంటీ వాళ్ల కొడుకును ఏదో అన్నావట. అంత చిన్న బాబుతో నీకు గొడవేంటి చింటూ!

చింటు: ఉన్న విషయమే అన్నాను అమ్మ.

అమ్మ: ఇంతకీ ఏమన్నావురా?

చింటు: ఆ బాబుకు సిగ్గులేదు అన్నాను.

అమ్మ: అలా ఎందుకు అన్నావురా?

చింటు: మరి ఆ బాబు చెడ్డీ వేసుకోకుండానే పుట్టాడు అమ్మా!

అమ్మ: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని