నవ్వుల్‌.. నవ్వుల్‌!

టింకు: అంకుల్‌ మీరు ఎంతవరకు చదువుకున్నారు?

Published : 18 Jan 2022 01:13 IST

సరిగా చదువుకోలేదు మరి!

టింకు: అంకుల్‌ మీరు ఎంతవరకు చదువుకున్నారు?
అంకుల్‌: ఎమ్‌.ఎ. వరకు టింకు.
టింకు: చదివిందే రెండక్షరాలు. అవి కూడా రివర్స్‌లోనా!
అంకుల్‌: ఆఁ!!


అయ్య బాబోయ్‌!

టీచర్‌: చింటూ మీ ఇంట్లో ఎవరైనా దొంగ పడ్డాడనుకో నువ్వేం చేస్తావ్‌?
చింటు: ‘మర్యాదగా నా స్కూల్‌ బ్యాగ్‌ కూడా పట్టుకుపో.. లేకపోతే దొంగా..! దొంగా..! అని గట్టిగా అరుస్తా’ అని ఆ దొంగను బెదిరిస్తా టీచర్‌.
టీచర్‌: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని