నవ్వుల్.. నవ్వుల్..!
చింటు: పింకీ... నాకస్సలు టైంపాస్ అవ్వడం లేదు. తెగ బోర్ కొడుతోంది.
అయ్యో... పాపం!
చింటు: పింకీ... నాకస్సలు టైంపాస్ అవ్వడం లేదు. తెగ బోర్ కొడుతోంది.
పింకి: అవునా.. అయితే గుడికి వెళ్లు.
చింటు: గుడికా.. ఎందుకు?
పింకి: మెట్ల దగ్గర ఉన్న చెప్పులన్నీ చిందరవందర చేసేయ్! తర్వాత ఓ పక్కన కూర్చో.. అందరూ వచ్చి వాళ్ల వాళ్ల చెప్పుల కోసం కంగారు పడతారు. అది చూస్తే భలే టైంపాస్ అవుతుంది.
చింటు: ఆఁ!!
ఇంతకీ ఏం రాస్తున్నావ్?
నాన్న: బంటీ.. ఏంటీ మధ్య ఆ డైరీలో తెగ రాస్తున్నావ్?
బంటి: ఓ అదా డాడీ..! మమ్మీ, మీరు నన్ను ఏ రోజు ఏమని తిడుతున్నారో రాస్తున్నా.
నాన్న: గుడ్... నీలో మార్పు కోసమే కదా ఇదంతా.. వెరీగుడ్!
బంటి: కాదు నాన్నా.. నేను పెద్దయ్యాక మీ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి!
నాన్న: ఆఁ!!
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.