నవ్వులే.. నవ్వులు..!

బంటి: చంటీ.. నీకు ఇంగ్లిష్‌ మాట్లాడటం వచ్చా?చంటి: వచ్చుగానీ..

Published : 10 Feb 2022 00:57 IST

నిజమే మరి!

బంటి: చంటీ.. నీకు ఇంగ్లిష్‌ మాట్లాడటం వచ్చా?
చంటి: వచ్చుగానీ..
బంటి: ఆఁ!!. చెప్పు ఏంటో..
చంటి: ఇంగ్లిష్‌ మాట్లాడటం వచ్చిన వాళ్లతో మాట్లాడటం రాదు.
బంటి: ఆఁ!!


మా నాన్న ఊరెళ్లారు..

టీచర్‌: ఏంటి చింటూ..! వరుసగా రెండు రోజుల నుంచి హోం వర్క్‌ చేయడం లేదు.
చింటు: మరో రెండు రోజులూ చేయలేను టీచర్‌.
టీచర్‌: ఏ.. ఎందుకు ఒంట్లో బాలేదా?
చింటు: లేదు టీచర్‌.. మా నాన్న ఊరెళ్లారు. రావడానికి మరో రెండు రోజులు పడుతుంది.
టీచర్‌: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని