Published : 16 Feb 2022 00:32 IST

నవ్వుల్‌.. నవ్వుల్‌..!

ఇదేం పోలిక!
అమ్మ: టింకూ.. బంటీతో ‘నువ్వు మ్యాగీలాంటోడివి. నేను బిర్యానీలాంటోడిని’ అని అన్నావట. దానర్థం ఏంటి?
టింకు: బంటీ కన్నా నేను గ్రేట్‌ అని అమ్మ.
అమ్మ: అవునా.. అదెలా?
టింకు: మ్యాగీ తయారు కావాలంటే రెండు నిమిషాలు చాలు. కానీ బిర్యానీ చేయాలంటే కనీసం గంటైనా పడుతుంది. అందుకే నేను బిర్యానీ, బంటీ మ్యాగీ అమ్మా!  
అమ్మ: ఆఁ!!
మరి పూరీ ఎందుకలా?
జెస్సీ: పొగిడితే ఎవరైనా పొంగిపోతారు అని మొన్న నాతో చెప్పావు కదమ్మా!
అమ్మ: అవును.. ఇప్పుడు ఆ విషయం ఎందుకు అడుగుతున్నావు?
జెస్సీ: ఏం లేదమ్మా.. మరి ఎవరూ పొగడకుండానే పూరీ పొంగిపోతుంటేనూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు