నవ్వుల్‌.. నవ్వుల్‌

రింకూ.. ‘మైసూర్‌ బోండాలో, మైసూర్‌ పాక్‌లో మైసూరు ఉండదు కదా.. అలాంటిది ఇంకోటి చెప్పు?

Updated : 19 Feb 2022 05:28 IST

పాయింటే కదా!

టీచర్‌ : రింకూ.. ‘మైసూర్‌ బోండాలో, మైసూర్‌ పాక్‌లో మైసూరు ఉండదు కదా.. అలాంటిది ఇంకోటి చెప్పు?
రింకు : ఆన్సర్‌ పేపర్‌ టీచర్‌..
టీచర్‌ : ఆ..!!

ఇష్టమూ మారింది

టీచర్‌: కవితా.. సెలవుల్లో ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నావ్‌?
కవిత : అరుణాచల్‌ప్రదేశ్‌ టీచర్‌..
టీచర్‌ : గుడ్‌.. అయితే, దాని స్పెల్లింగ్‌ చెప్పు..
కవిత : కాదు కాదు టీచర్‌.. నేను గోవా వెళ్దామనుకుంటున్నా..

అలా అర్థమైందా!

రియా : విక్కీ.. ఎక్కడికెళ్లినా మీ మావయ్య కుడి చేతిలో సెల్‌ఫోన్‌, ఎడమ చేతిలో ఛార్జర్‌ తీసుకెళ్తున్నాడేంటి?
విక్కి : ఓహ్‌.. అదా! మరేం లేదు రియా.. ఎవరింటికెళ్లినా ఖాళీ చేతులతో వెళ్లొద్దని బామ్మ చెప్పిందట..


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని