నవ్వుల్‌... నవ్వుల్‌!

టీచర్‌ : వరుణ్‌.. ‘కంప్లీట్‌’కు, ‘ఫినిష్‌’కు తేడా ఏంటో తెలుసా?

Published : 25 Feb 2022 00:30 IST

కష్టం బాబోయ్‌..!

టీచర్‌ : వరుణ్‌.. ‘కంప్లీట్‌’కు, ‘ఫినిష్‌’కు తేడా ఏంటో తెలుసా?
వరుణ్‌ : తెలుసు టీచర్‌..
టీచర్‌ : ఏంటో అందరికీ వినిపించేలా నిలబడి చెప్పు..
వరుణ్‌ : ఈరోజుకి మీది ఇదొక్కటే పీరియడ్‌ అంటే ‘కంప్లీట్‌’, సాయంత్రం వరకూ మీరే అంటే ‘ఫినిష్‌’..
టీచర్‌ : ఆ..!!


రివర్స్‌ గేర్‌..

టీచర్‌ : వినీలా.. కుక్క మొరుగుతూ వెంటబడితే పారిపోకుండా ఏం చేస్తున్నావ్‌?
వినీల : ‘మొరిగే కుక్క కరవదని’ మీరే చెప్పారు కదా టీచర్‌..
టీచర్‌ : ఆ..!!


మీరే మరి!

టీచర్‌ : రాకీ.. ఎదుటి వాళ్లకు ఇష్టమున్నా లేకపోయినా, వింటున్నా వినకపోయినా.. నాన్‌స్టాప్‌గా చెప్పేవాళ్లను ఏమంటారు?
రాకీ  : టీచర్‌..
టీచర్‌ : ఆ..!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని