నవ్వుల్‌... నవ్వుల్‌...!

ఇదా కారణం?టీచర్‌: టింకూ.. నువ్వెందుకు స్కూల్‌ వాట్సాప్‌ గ్రూప్‌ నుంచి ఎగ్జిట్‌ అయ్యావ్‌.

Published : 27 Feb 2022 00:21 IST

ఇదా కారణం?
టీచర్‌: టింకూ.. నువ్వెందుకు స్కూల్‌ వాట్సాప్‌ గ్రూప్‌ నుంచి ఎగ్జిట్‌ అయ్యావ్‌.
టింకు: గ్రూప్‌గా ఉంటే కరోనా వస్తుందంటున్నారుగా టీచర్‌.. అందుకే!
టీచర్‌: ఆఁ!!

అంతే అంటావా?
టీచర్‌: ఏంటి తరుణ్‌.. దేని గురించో తెగ ఆలోచిస్తున్నావ్‌?
తరుణ్‌: రష్యా, ఉక్రెయిన్‌తో భీకరంగా యుద్ధం చేస్తోంది కదా టీచర్‌!
టీచర్‌: అవును.. అయితే...
తరుణ్‌: మనం చైనా వాళ్ల యాప్‌లు బ్యాన్‌ చేసినట్లు.. రష్యా కూడా ఉక్రెయిన్‌ వాళ్ల యాప్‌లు బ్యాన్‌ చేస్తే సరిపోతుంది కదా. ఇంతలా యుద్ధం చేయడం ఎందుకు?
టీచర్‌: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని