నవ్వుల్‌.. నవ్వుల్‌

టీచర్‌ : హరీ.. ‘నేను ఆపిల్‌ తింటున్నా’ వాక్యాన్ని ఇంగ్లిష్‌లో చెప్పు?

Updated : 01 Mar 2022 00:52 IST

ఇస్తేనే చెబుతా..

టీచర్‌ : హరీ.. ‘నేను ఆపిల్‌ తింటున్నా’ వాక్యాన్ని ఇంగ్లిష్‌లో చెప్పు?
హరి : ముందు మీరు ఆపిల్‌ ఇవ్వండి టీచర్‌.. తింటూ చెబుతా..
టీచర్‌ : ఆ..!!

పొరపాటు లేదోయ్‌..

నాన్న : రవీ.. పరీక్ష పేపర్లు ఇచ్చారట కదా.. నీకెన్ని మార్కులొచ్చాయి?
రవి :  29 నాన్నా..
నాన్న :: మరి, పక్కింటి అవినాష్‌కి ఎన్నొచ్చాయి?
రవి :  92 నాన్నా..
నాన్న : వాడికంటే తక్కువ మార్కులొస్తే నీకు సిగ్గనిపించడం లేదా?
రవి :  కుడి ఎడమైతే పొరపాటు లేదన్నారు కదా..
నాన్న : ఆ..!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని