నవ్వుల్‌.. నవ్వుల్‌

టింకు : రాకీ.. మీ మావయ్య ఏంటి.. పొద్దుపొద్దున్నే మెకానిక్‌తో గొడవ పడుతున్నాడు.

Published : 03 Mar 2022 01:09 IST

ఎక్కువ పోయిస్తే సరి!

టింకు : రాకీ.. మీ మావయ్య ఏంటి.. పొద్దుపొద్దున్నే మెకానిక్‌తో గొడవ పడుతున్నాడు.
రాకీ : ‘నా బండి ఇప్పుడు లీటరు పెట్రోల్‌కు 50 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది.. 75 రావాలంటే ఏం చేయాలి’ అని అడిగాడట.
టింకు : దానికి ఆ మెకానిక్‌ ఏం చెప్పాడు మరి?
రాకీ : ‘లీటరున్నర పెట్రోల్‌ పోయించండి’ అన్నాడట..
టింకు : ఆ..!!


నేర్పలేదట..

అమ్మ : మొదటి రోజు స్కూల్‌కి వెళ్లావు కదా! ఏం నేర్పించారు?
శశి : రాయడం నేర్పించారమ్మా..
అమ్మ : ఏదీ.. నువ్వు రాసింది ఓసారి చదువు..
శశి : చదవడం ఇంకా నేర్పలేదమ్మా..
అమ్మ : ఆ..!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని