నవ్వుల్‌.. నవ్వుల్‌

అను : మావయ్యా.. మావయ్యా.. నేనో మ్యాజిక్‌ నేర్చుకున్నా! మావయ్య : అవునా.. ఏదీ ఒకసారి చేసి చూపించు..

Published : 04 Mar 2022 00:58 IST

భలే మ్యాజిక్‌..
అను : మావయ్యా.. మావయ్యా.. నేనో మ్యాజిక్‌ నేర్చుకున్నా!
మావయ్య : అవునా.. ఏదీ ఒకసారి చేసి చూపించు..
అను : ముందుగా గ్లాసు నీళ్లలో ఉప్పు వేశా.. కాసేపు ఇలా ఇలా తిప్పా.. అంతే, ఉప్పు మాయం..
మావయ్య: ఆ..!!

ఎప్పుడూ కలల్లోనేనా?
టీచర్‌ : విక్కీ.. దేని గురించో ఆలోచిస్తున్నట్లు ఉన్నావు?
విక్కి : అవును టీచర్‌..
టీచర్‌ : ఏంటో చెబితే.. నేనూ ఆలోచిస్తాను కదా..
విక్కి : బడికీ, సెలవులకీ, కలలకూ ఏదో దగ్గరి సంబంధం ఉన్నట్లుంది టీచర్‌..
టీచర్‌ : ఎందుకలా అంటున్నావు?
విక్కి : మరేం లేదు టీచర్‌.. సెలవుల్లో బడి కలలోకి వస్తుంది, బడిలోనేమో సెలవుల గురించి కలలు కంటాం..
టీచర్‌ : ఆ..!

కావాల్సింది అదే కదా!
టీచర్‌ : రిక్కీ.. భారీ వరదలు, తుపానులు వస్తే ఏమవుతుంది?
రిక్కి : బడికి సెలవులొస్తాయి టీచర్‌..
టీచర్‌ : ఆ..!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని