నవ్వుల్‌.. నవ్వుల్‌...!

టింకు: చంటీ.. నీ దగ్గర చాలా పుస్తకాలున్నాయే! రెండు రోజుల్లో చదివిచ్చేస్తాను. కొన్ని పుస్తకాలు నాకు ఇస్తావా?

Updated : 06 Mar 2022 05:58 IST

ఇవ్వనుగాక ఇవ్వను!

టింకు: చంటీ.. నీ దగ్గర చాలా పుస్తకాలున్నాయే! రెండు రోజుల్లో చదివిచ్చేస్తాను. కొన్ని పుస్తకాలు నాకు ఇస్తావా?

చంటి: ఇవ్వను టింకూ.. నేనూ ఇలాగే చెప్పి ఇవన్నీ తీసుకువచ్చాను.

టింకు: ఆఁ!!


కారణం అదన్నమాట!

టీచర్‌: మనదేశంలో కరోనా ఫోర్త్‌ వేవ్‌ ఆలస్యం కావడానికి కారణం ఏంటో తెలుసా పిల్లలూ?

బంటి: ఆ.. నాకు తెలుసు టీచర్‌.

టీచర్‌: గుడ్‌.. కారణం ఏంటో చెప్పు బంటీ!

బంటి: రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం?

టీచర్‌: అవునా.. అదెలా?

బంటి: మీడియా మొత్తం యుద్ధం గురించే వార్తలు కవర్‌ చేస్తోంది. అందుకే కరోనా ఫోర్త్‌వేవ్‌ ఆలస్యమవుతోంది టీచర్‌.

టీచర్‌: ఆఁ!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని