నవ్వుల్‌.. నవ్వుల్‌..

ఆంటీ: లిల్లీ.. నీకు షేర్‌ ఆటో అంటే ఏంటో తెలుసా?

Published : 07 Mar 2022 01:11 IST

అవునా.. నిజమా!

ఆంటీ: లిల్లీ.. నీకు షేర్‌ ఆటో అంటే ఏంటో తెలుసా?

లిల్లి: ఓ తెలుసుగా.

ఆంటీ: అవునా.. అయితే ఏంటో చెప్పు?

లిల్లి: షేర్‌ మార్కెట్‌కు తీసుకెళ్లే ఆటోనే షేర్‌ ఆటో అంటారు.

ఆంటీ: ఆఁ!!


ఇదన్న మాట తేడా!

చంటి: ఆనందం.. బాధగా ఎలా మారుతుంది?

బంటి: ఆదివారం సెలవు కాబట్టి ఆనందం. కానీ మరో రోజు రావాల్సిన సెలవు కూడా ఆదివారం వస్తే బాధ.

చంటి: ఆఁ!!


నిజంగా నిజమే మరి!

టీచర్‌: ‘సూర్యుడు తూర్పున ఉదయిస్తాడన్నది ఎంత నిజమో...’ ఈ వాక్యాన్ని పూర్తి చేయి చిన్నూ.

చిన్ను: పడమరన అస్తమిస్తాడన్నది కూడా అంతే నిజం.

టీచర్‌: ఆఁ!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని