నవ్వుల్‌.. నవ్వుల్‌

నాన్నా.. నేను మీలా కాదు!   నాన్న: టింకూ.. ఎందుకు ఏడుస్తున్నావ్‌?

Published : 08 Mar 2022 01:18 IST

నాన్నా.. నేను మీలా కాదు!

నాన్న: టింకూ.. ఎందుకు ఏడుస్తున్నావ్‌?

టింకు: అమ్మ కొట్టింది నాన్నా.

నాన్న: అమ్మే కదా కొట్టింది. ఏడవకు టింకూ!

టింకు: నీకంటే అలవాటైపోయింది నాన్నా. నాకు నొప్పేస్తోంది మరి!

నాన్న: ఆఁ!!

ఏది నిజం?

టీచర్‌: ఏంటి పింకీ.. ఏదో ఆలోచిస్తున్నావు? ఏమైనా అనుమానమా?

పింకి: అవును టీచర్‌.

టీచర్‌: సందేహం వచ్చినప్పుడు వెంటనే నివృత్తి చేసుకోవాలి. అడుగు నీకొచ్చిన అనుమానం ఏంటో?

పింకి: ఏం లేదు టీచర్‌.. మొన్నేమో మీరు ‘నిదానమే ప్రధానం’ అని చెప్పారు. ఇప్పుడేమో ‘ఆలస్యం అమృతం విషం’ అంటున్నారు. ఈ రెండింటిలో ఏది పాటించాలి? అని ఆలోచిస్తున్నా...

టీచర్‌: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని