నవ్వుల్‌.. నవ్వుల్‌...!

నాన్న: ఏంటి బంటీ.. ఈ మధ్య డైలీ డైరీ రాస్తున్నావ్‌? బంటి: ఏం లేదు నాన్నా.. రోజూ నువ్వు ఎన్ని తిట్లు తిడుతున్నావో రాస్తున్నా.

Published : 11 Mar 2022 00:17 IST

గుర్తుండాలిగా మరి!
నాన్న: ఏంటి బంటీ.. ఈ మధ్య డైలీ డైరీ రాస్తున్నావ్‌?
బంటి: ఏం లేదు నాన్నా.. రోజూ నువ్వు ఎన్ని తిట్లు తిడుతున్నావో రాస్తున్నా.
నాన్న: ఎందుకు?
బంటి: నేను పెద్దయ్యాక ప్రతీకారం తీర్చుకోవాలిగా...
నాన్న: ఆఁ!!


మీరే చెప్పారుగా!
టీచర్‌: విద్యలేని వాడు వింత పశువు... ఏదీ ఒకసారి ఈ వాక్యం చెప్పు టింకూ!
టింకు: ఊహూ.. నేను చెప్పను టీచర్‌.
టీచర్‌: ఏ.. ఎందుకు?
టింకు: మొన్న మీరే చెప్పారుగా.. కారణం లేకుండా ఇతరుల మనసు నొప్పించకూడదు అని.
టీచర్‌: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని