Published : 12 Mar 2022 00:15 IST

నవ్వుల్‌.. నవ్వుల్‌..!

లేకపోతే అంతే!

మిన్ను : బన్నూ.. మీ మావయ్య ఇంటికి పోలీసులొచ్చారెందుకు?

బన్ను : మరేం లేదు మిన్నూ.. రెడ్‌ సిగ్నల్‌ పడినా ఆగకుండా బైక్‌ మీద వెళ్లిపోయాడట..

మిన్ను : సిగ్నల్‌ను చూడలేదేమో..

బన్ను : కాదు.. అక్కడున్న పోలీసును చూడలేదట..

మిన్ను : ఆ..!!

పప్పీ బతికితే చాలు...

టీచర్‌ : చిట్టీ.. బడికి ఎందుకు ఆలస్యంగా వచ్చావు?

చిట్టి : పప్పీకి యాక్సిడెంట్‌ అయితే ఆసుపత్రికి తీసుకెళ్లా టీచర్‌..

టీచర్‌ : అలాగా.. డాక్టర్‌ ఏమన్నారు మరి? 

చిట్టి : ఆపరేషన్‌ చేస్తే 50 శాతం మాత్రమే బతికే ఛాన్స్‌ ఉందన్నారు టీచర్‌..

టీచర్‌ : నువ్వేమన్నావు అయితే..?

చిట్టి : రెండుసార్లు ఆపరేషన్‌ చేసి.. వందశాతం బతికించమని అడిగా టీచర్‌..

టీచర్‌ : ఆ..!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని