Updated : 15 Mar 2022 00:30 IST

నవ్వుల్‌.. నవ్వుల్‌..!

ఫర్లేదు అమ్మా.. ఫర్లేదు!

చంటి: అమ్మా.. ఫ్రిజ్‌లోంచి నీళ్ల బాటిల్‌ తెచ్చివ్వు.
అమ్మ: చంటీ.. నాకు వంటగదిలో చాలా పని ఉంది. నువ్వే తెచ్చుకో.
చంటి: ప్లీజ్‌ అమ్మా...! ప్లీజ్‌..!
అమ్మ: కుదరదు గాక కుదరదు.
చంటి: అమ్మా.. ప్లీజ్‌... ప్లీజ్‌.. ప్లీజ్‌...!
అమ్మ: నువ్వే తెచ్చుకో.. ఈ సారి అడిగితే వచ్చి తంతాను నిన్ను.
చంటి: తన్నడానికి వచ్చేటప్పుడే తెచ్చివ్వు అమ్మా ఫర్లేదు.
అమ్మ: ఆఁ!!

నాకు రాదు అంకుల్‌!

అంకుల్‌: చింటూ.. టిఫిన్‌ చేశావా?  
చింటు: నాకు టిఫిన్‌ చేయడం రాదు అంకుల్‌. కేవలం తినడం మాత్రమే వచ్చు.
అంకుల్‌: ఆఁ!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు