Published : 17 Mar 2022 00:34 IST

నవ్వుల్‌.. నవ్వుల్‌...!

వచ్చాడండీ సైంటిస్టు!

టీచర్‌: బంటీ.. నీళ్లు మరిగించేటప్పుడు శబ్దం ఎందుకు వస్తుందో తెలుసా?

బంటి: ఓ.. తెలుసు టీచర్‌.

టీచర్‌: గుడ్‌.. ఎందుకో చెప్పు మరి.

బంటి: నీళ్లలో బ్యాక్టీరియా ఉంటుంది టీచర్‌. మనం నీటిని మరిగించేటప్పుడు ఆ వేడికి అవి అరుస్తాయి. అందుకే శబ్దం వస్తుంది టీచర్‌.

టీచర్‌: ఆఁ!!


గొప్ప సత్యమే!

చింటు: నాన్నా.. నీకో జీవిత సత్యం చెప్పనా?

నాన్న: వేలెడంత లేవు. నువ్వు జీవిత సత్యం చెబుతావా? సరే చెప్పు.. ఏం చెబుతావో..

చింటు: బజార్‌లో జార్‌ ఉంటుంది. కానీ జార్‌లో బజార్‌ ఉండదు.

నాన్న: ఆఁ!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని