నవ్వుల్‌.. నవ్వుల్‌..!

హోలీకి ఒక్కరోజే సెలవు కదా.. మరి నువ్వేంటి మూడు రోజులు తీసుకున్నావు చింటూ!

Updated : 21 Mar 2022 00:40 IST

నిజమే సుమీ!

టీచర్‌: హోలీకి ఒక్కరోజే సెలవు కదా.. మరి నువ్వేంటి మూడు రోజులు తీసుకున్నావు చింటూ!

చింటు: హోలీ రోజు రంగులు పూసుకున్నా టీచర్‌. వాటిని వదిలించుకోవడానికి ఇంకో రోజు పట్టింది.

టీచర్‌: ఓకే.. మరి మూడో రోజు ఏం చేశావ్‌?

చింటు: రంగులు పూయించుకుని, వాటిని వదిలించుకుని చాలా అలసిపోయాను టీచర్‌. అందుకే మూడో రోజు పూర్తిగా విశ్రాంతి తీసుకుని..  ఇదిగో ఈ రోజు స్కూలుకు వస్తున్నా.

టీచర్‌: ఆఁ!!

ఇలా కూడా అంటారా?

టీచర్‌: కుగ్రామం అంటే ఏంటో తెలుసా?

పింకి: ఓ.. తెలుసు టీచర్‌.

టీచర్‌: గుడ్‌.. ఏంటో చెప్పు పింకీ!

పింకి: కు అనే పేరుగల గ్రామం టీచర్‌.

టీచర్‌: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని